ఐపీఎల్ వేలంలో రిషభ్‌దే అత్యధిక రికార్డు ధర
ఏకంగా రూ. 27 కోట్లతో అతడిని సొంతం చేసుకున్నలఖ్‌నవూ
ఐపీఎల్ వేలంలో టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై కాసుల వర్షం కురిసింది. అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. లఖ్‌నవూ ఏకంగా రూ. 27 కోట్లకు అతడిని సొంతం చేసుకున్నది. పంత్ కోసం లఖ్‌నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి లఖ్‌నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకున్నది. శ్రేయాస్ అయ్యర్ కూడా రికార్డు ధర పలికాడు. రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ శ్రేయస్‌ను దక్కించుకున్నది. అతని కోసం మొదట కోలకతా, ఢిల్లీ పోటీ పట్టాయి. తర్వాత పంజాబ్ రేసులోకి వచ్చింది. చివరకు పంజాబ్ కింగ్స్ రూ 26.75 కింగ్స్ సొంతం చేసుకున్నది. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్‌ను ఆర్డీఎమ్ కార్డు ద్వారా రూ. 18 కోట్లకు పంజాబే తీసుకున్నది. కనీస ధర రూ. 2 కోట్లు ఉన్న భారత ఫేసర్ కోసం మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్ అతని తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్ కూడా అతని కోసం బిడ్ వేశాయి. చివరికి ఆర్‌టీఎమ్‌ను ప్రయోగించిన పంజాబ్ రూ. 18 కోట్లకు సొంతం చేసుకున్నది.
ఏ ఆటగాడిని.. ఏ ఫ్రాంఛైజీ ఎంతకు దక్కించుకున్నదంటే?
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ. 18 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకున్నది.
ఇంగ్లాండ్ జోస్ బట్లర్‌ను గుజరాత్ టైటాన్స్ 15.75 కోట్లకు దక్కించుకున్నది.
టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 14 కోట్లకు
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు గుజరాత్ దక్కించుకున్నది.
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూ. 11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం కున్నది.
దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడను రూ. 10.75 కోట్లకు గుజారత్ టైటాన్స్ దక్కించుకున్నది.
మహ్మద్ షమిని రూ. 10 కోట్లకు సన్‌రైజర్ల్ హైదరాబాద్ సొంతం చేసుకున్నది.
ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ రూ. 87. కోట్లకు
దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను రూ. 7.5 కోట్లకు లఖ్‌నవూ దక్కించుకున్నది.