టీ20 వరల్డ్‌కప్ కీపర్ స్పాట్... పంత్‌కు సవాల్ విసురుతున్న కేఎల్, సంజు
పంత్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం కోసం ఐపీఎల్‌ను ఫుల్ లెంగ్త్ వాడేసుకుంటున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో పంత్ ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్‌లో 371 పరుగులు చేశాడు.
టీ20 వరల్డ్ కప్‌కు టీమ్ సెలక్షన్ డేట్ వచ్చేస్తోంది. ఐపీఎల్‌లో ప్రతిభ ఆధారంగానే టీ20 వరల్డ్‌కప్‌కు ఇండియా టీమ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. దీంతో ఈ కప్‌లో ఇండియన్ ఆటగాళ్లు ముఖ్యంగా కీపర్ బ్యాట్స్‌మన్లు ఒకరిని మించి మరొకరు సత్తా చాటుతున్నారు. ఇది సెలక్టర్లకు స్వీట్ హెడేక్‌గా మారింది. కీపర్ బ్యాట్స్‌మన్ రేసులో ప్రధానంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్, లక్నో సూపర్ జెయంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నువ్వా నేనా అంటున్నారు.
పంత్.. కమ్‌బ్యాక్ కోసం
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్ ఇండియన్ క్రికెట్ టీమ్‌లో కీపర్ స్థానానికి బీసీసీఐకి ఫస్ట్ ఛాయిస్. అయితే గత ఏడాది రోడ్ యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాలపాలై అతి కష్టమ్మీద ప్రాణాలతో బయటపడ్డ పంత్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం కోసం ఐపీఎల్‌ను ఫుల్ లెంగ్త్ వాడేసుకుంటున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో పంత్ ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్‌లో 371 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో పంత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. గత మ్యాచ్‌లో జీటీపై 88 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. టీ20 వరల్డ్ కప్‌కు ఇండియాకు కీపర్ బ్యాట్స్‌మన్ ప్లేస్ తనదే అంటున్నాడు.
రాహుల్.. సూపర్
ఇక ఈ సీజన్‌లో మూడు హాఫ్ సెంచరీలతో జట్టును విజయపథంలో నిలబెట్టాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ సీజన్‌లో 378 పరుగులతో పంత్‌ను తరుముకొస్తున్నాడు. ఓపెనర్ నుంచి లోయర్ మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా ఆడగల సత్తా కేఎల్‌కు అదనపు బలం. ఓపెనర్ నుంచి సిక్స్ డౌన్ వరకు ఎక్కడ దింపినా ఆడగలడన్న ధైర్యం ఉంది. కీపింగ్ పరంగానూ బాగానే ఉండటంతో అతని పేరునూ సెలక్షన్ కమిటీ సీరియస్‌గా పరిశీలిస్తోంది.
సంజు.. పట్టు వదలట్లేదు
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కీపర్ బ్యాట్స్‌మన్ రేసులో పంత్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో రాజస్థాన్‌ను టేబుల్ టాపర్‌గా నిలిపిన సంజు కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో జట్టు విజయాలకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. 385 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి సవాల్ విసురుతున్నాడు. జాతీయ జట్టులో పెద్దగా రాణించడన్న అపవాదు సంజును రేసులో కాస్త వెనక్కి లాగుతోంది.
వెటరన్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ కూడా సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. జాతీయ జట్టులో అతని ప్రదర్శన అంతంమాత్రంగానే ఉంటుందన్న గణాంకాల నేపథ్యం అతనికి ప్రతిబంధకంగా మారింది.