ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడా..?
ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ఆయన ఇష్టమేనని సీఎస్కే యాజమాన్యం చెబుతోంది. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి తమకేమీ చెప్పలేదని.. ఈసీజన్‌లో అతను చాలా ఫిట్‌గా కూడా ఉన్నాడని గుర్తుచేసింది
చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెబితే గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికేసిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రం చెన్నైకు ఆడుతున్నాడు. చెన్నై జట్టును లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో రెండో స్థానంలో నిలబెట్టడంలో మహేంద్రుడి పాత్ర మరిచిపోలేనిది. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఆటగాడిగా కొనసాగుతున్న ధోనీ, ఈ సీజన్‌తో దానికి కూడా గుడ్‌బై చెప్పేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్సీబీతో రెండు రోజుల కిందట జరిగిన మ్యాచే ధోనీకి చివరి ఐపీఎల్ మ్యాచ్ అయి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.
కెప్టెన్ల మార్పుతోనే సంకేతాలు
గతేడాది ఐపీఎల్‌లో సడెన్‌గా ధోనీని కాదని జడేజాను కెప్టెన్‌గా నియమించారు. దీంతో ధోనీ నిష్క్రమణ త్వరలోనే ఉంటుందని తేలిపోయింది. అయితే ఆ సీజన్‌లో జడ్డూ విఫలమవడంతో ధోనీయే మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ అప్పగించారు. అతను బ్యాటింగ్‌తోపాటు కెప్టెన్సీని బాగానే లాక్కొస్తున్నాడు. జట్టు కూడా సమన్వయంతో కుదురుకుంది కాబట్టి ధోనీ నిష్క్రమణకు పెద్దగా అడ్డంకులేమీ లేనట్లే.
ఆయన నిర్ణయమే ఫైనల్
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్‌లో ఈ స్థాయిని తెచ్చింది ధోనీ నాయకత్వమే అనేది నిస్సందేహం. అందుకే ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం ఆయన ఇష్టమేనని సీఎస్కే యాజమాన్యం చెబుతోంది. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి తమకేమీ చెప్పలేదని.. ఈసీజన్‌లో అతను చాలా ఫిట్‌గా కూడా ఉన్నాడని గుర్తుచేసింది. ఒకవేళ కొనసాగాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా కేవలం బ్యాటింగ్‌కు దింపే ఆలోచనల్లో కూడా సీఎస్కే ఉంది. కానీ, ధోనీ వీటన్నింటికీ సింగిల్ డైలాగ్‌తో చెక్ పెట్టేస్తాడు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి అతను అలాగే హఠాత్తుగా వైదొలిగాడు.