Telugu Global
Sports

ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌

కోహ్లీ జట్టులో ఉన్నా కెప్టెన్సీ వైపు మొగ్గుచూపలేదు.. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రజత్‌ కు బాధ్యతలు అప్పగించిన మేనేజ్‌మెంట్‌

ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌
X

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025 లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కొత్త సారథి వచ్చాడు. యువ బ్యాటర్‌ రజత్‌ పటీదార్‌కు బాధ్యతలు అప్పగిస్తూ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. గత సీజన్‌లో ఆర్సీబీని నడిపించిన డుప్లెసిస్‌ను ఈసారి రిటైన్‌ చేసుకోలేదు. విరాట్‌కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ.. కెప్టెన్సీ వైపు మొగ్గుచూపలేదు. పేసర్‌ భువనేశ్వర్‌కుమార్‌తో పాటు కృనాల్‌ పాండ్య కూడా ఈ రేసులో నిలిచారు. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రజత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

First Published:  13 Feb 2025 12:11 PM IST
Next Story