చరిత్ర సృష్టించిన పూజా తోమర్, యూఎఫ్‌సీలో భారత్‌కు తొలి విజయం
భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ బ్రెజిల్‌కు చెందిన రయానే డోస్ శాంతోస్‌ను ఓడించి బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది.
భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ బ్రెజిల్‌కు చెందిన రయానే డోస్ శాంతోస్‌ను ఓడించి బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరాబాద్‌కు చెందిన పూజ..గతేడాదే యూఎఫ్‌సీ కాంట్రాక్ట్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్‌గా రికార్డు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు చాంపియన్‌గా నిలిచి అత్యంత అరుదైన రికార్డును తన పేరుపై రాసుకుంది.
ఇక ఆట విషయానికి వస్తే తొలి రౌండ్‌లో ప్రత్యర్ధిపై 30-27 స్కోర్‌తో దూకుడు ప్రదర్శించిన పూజా రెండో రౌండ్‌లో అమండా శాంటోస్ పుంజుకోవటంతో వెనుక బడింది. ఇక మూడో రౌండ్‌లో హోరాహోరీగా తలపడిన ఇద్దరు.. ఫైనల్ బెల్ మ్రోగే సమయానికి పూజ వరుస కిక్‌లతో అమండాను వెనక్కి నెట్టింది. దీంతో మూడో రౌండ్‌ను 29-28తో సొంతం చేసుకున్న పూజా తోమర్ యూఎఫ్‌సీ చాంపియన్‌గా నిలిచింది. తన విజయాన్ని పూజ ఇండియన్ ఫైటర్లు, అభిమానులకు అంకితమిచ్చింది. ఈ విజయాన్ని తనది కాదు తన తల్లిదని, ఆమె తనకోసం ప్రపంచంతో చాలా పోరాటం చేసిందని పేర్కొంది. ఇండియన్ ఫైటర్స్ అంటే ఓటమి చెందేవాళ్లు కాదని నిరూపించాలనుకున్నాననని, ఇప్పుడు నిరూపించానని ఆనందం వ్యక్తం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని బుధానా గ్రామంలో జన్మించిన పూజా.. చైనీస్ యుద్ధ కళ వుషుతో తన పోరాట క్రీడా ప్రయాణాన్నిమొదలు పెట్టింది. అందులో కూడా పూజ జాతీయ టైటిళ్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2012 లో సూపర్ ఫైట్ లీగ్‌తో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశించింది.