Telugu Global
Sports

పెర్త్‌ టెస్ట్‌.. పట్టుభిగిస్తోన్న భారత్‌

రెండో రోజు ముగిసిన ఆట.. వికెట్‌ నష్టపోకుండా 172 పరుగులు చేసిన ఇండియా ఓపెనర్లు

పెర్త్‌ టెస్ట్‌.. పట్టుభిగిస్తోన్న భారత్‌
X

బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా పెర్త్‌ వేదికగా జరుగుతోన్న ఫస్ట్‌ టెస్ట్‌ లో టీమిండియా పట్టు భిగిస్తోంది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో ఆస్ట్రేలియాను 103 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ లో రెండో రోజు (శనివారం) వికెట్‌ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్‌ 193 బంతుల్లో రెండు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 90 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 153 బంతులను ఎదుర్కొని నాలుగు ఫోర్లతో 62 పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 67/7 వద్ద బ్యాటింగ్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా మరో మూడు పరుగులకే ఎనిమిదో (అలెక్స్‌ క్యారీ) వికెట్‌ కోల్పోయింది. 79 పరుగలు పరుగుల వద్ద న్యాథన్‌ లయన్‌ 104 పరుగుల వద్ద మిచెల్‌ స్టార్క్‌ ఔటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా ఆల్‌ ఔట్‌ అయ్యింది. ఆసీస్‌ జట్టులో మిచెల్‌ స్టార్క్‌ 26, అలెక్స్‌ క్యారీ 21, ట్రావిస్‌ హెడ్‌ 11, మెక్ స్వీని10, ఖవాజా 8, మార్ష్‌ 6, ప్యాట్‌ కమిన్స్‌ 3, లబుషేన్‌ 2, న్యాథన్‌ లయన్‌ 5 పరుగులు చేశారు. హాజెల్‌వుడ్‌ ఏడు పరుగులతో నాటౌట్‌ గా నిలిచాడు. భారత బౌలర్లలో కెప్టెన్‌ జస్ప్రీత్‌ బూమ్రా ఐదు, హర్షిత్‌ రాణా మూడు, మహ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. మూడు రోజు ఆటలో పూర్తిగా లేదా రెండు సెషన్లు భారత జట్టు బ్యాటింగ్‌ చేస్తే ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం ఉంచవచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లీడ్‌ 46 పరుగులకు తోడు ఓవరాల్‌గా ఆస్ట్రేలియాపై 218 పరుగుల ఆదిక్యంలో ఉంది.

First Published:  23 Nov 2024 3:42 PM IST
Next Story