Telugu Global
Sports

చాంపియన్స్‌ ట్రోఫీ.. వెనక్కి తగ్గిన పాకిస్థాన్‌

ఐసీసీకి లేఖ రాసిన పీసీబీ.. బాల్‌ ఐసీసీ కోర్టులోనే ఉందని చెప్పిన పాక్‌

చాంపియన్స్‌ ట్రోఫీ.. వెనక్కి తగ్గిన పాకిస్థాన్‌
X

చాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్థాన్‌ నుంచి తరలించి సౌత్‌ ఆఫ్రికాలో నిర్వహిస్తారన్న ప్రచారంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు వెనక్కి తగ్గింది. చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనడంపై భారత వైఖరికి సంబంధించి వివరణ కోరుతూ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ బోర్డుకు పీసీబీ లేఖ రాసింది. హైబ్రిడ్‌ మోడ్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌ లను తటస్థ వేదికపై నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్‌ చేస్తోంది. ఇదే విషయాన్ని గతంలోనే ఐసీసీకి తేల్చిచెప్పింది. ఒకవేళ హైబ్రిడ్‌ మోడ్‌కు పీసీబీ ఒప్పుకోకుంటే తాము టోర్నీ నుంచి తప్పుకుంటామని ఇండియా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ మోడ్‌ లో మ్యాచ్‌ ల నిర్వహణ ప్రతిపాదనను ఐసీసీ తెరపైకి తెచ్చింది. చర్చల దశలో ఆ ప్రపోజల్‌ కు పీసీబీ ససేమిరా అంది. దీంతో మొత్తం చాంపియన్స్‌ ట్రోఫి నిర్వహణ బాధ్యతల నుంచి పాక్‌ ను తప్పించాలని ఐసీసీ ఎత్తుగడ వేసింది. అదే జరిగితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి పాక్‌ క్రికెట్‌ బోర్డు తమ తప్పు లేదని చెప్పుకోవడానికి బాల్‌ ను ఐసీసీ కోర్టులోకి నెట్టేసింది. టోర్నీలో పాల్గొనడంపై భారత్‌ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని ఐసీసీని పీసీబీ కోరింది. భారత వైఖరిలో మార్పేమి లేదు కాబట్టి అయితే హైబ్రిడ్‌ మోడ్‌ కు ఒప్పుకోవడం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం పాకిస్థాన్‌ ముంగిట లేదు.

First Published:  12 Nov 2024 3:53 PM IST
Next Story