Sports
ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ ను చేజిక్కించుకోడంలో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ విఫలమైనా..అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికె్ట్లు పడగొట్టిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ అవార్డులను రాయల్స్ జోడీ జోస్ బట్లర్, యుజవేంద్ర చహాల్ గెలుచుకొన్నారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన టైటిల్ సమరంలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల పరాజయం తో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. […]
ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోరు ఎలిమినేటర్ రౌండ్లోనే ముగిసినా…కెప్టెన్ కెఎల్ రాహుల్ మాత్రం ఓ అసాధారణ రికార్డుతో తన ఫ్రాంచైజీకే గర్వకారణంగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో కెఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ తుదివరకూ పోరాడి 14 పరుగుల పరాజయంతో టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించింది. 208 పరుగుల భారీటార్గెట్ తో […]
టాటా ఐపీఎల్ 15వ సీజన్ ప్లేఆఫ్ రౌండ్ రెండో (ఎలిమనేటర్ రౌండ్ ) పోరుకు లీగ్ టేబుల్ మూడు, నాలుగుస్థానాలలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సై అంటున్నాయి. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ నాకౌట్ పోరు రెండుజట్లకూ జీవన్మరణసమస్యగా మారింది. మరోవైపు…హైస్కోరింగ్ పోరుగా ముగిసిన క్వాలిఫైయర్ -1 లో రాజస్థాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించడం ద్వారా అహ్మదాబాద్ టైటాన్స్ […]
ప్రపంచ టెన్నిస్ పురుషుల గ్రాండ్ స్లామ్ టోర్నీలలో ఓ అరుదైన రికార్డుకు టాప్ ర్యాంక్ ఆటగాడు, సెర్పియన్ వండర్ నొవాక్ జోకోవిచ్ గురిపెట్టాడు. పారిస్ లోని రోలాండ్ గారోస్ వేదికగా జరుగుతున్న 2022 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో తొలిరౌండ్ విజయంతో టైటిల్ వేటను మొదలు పెట్టాడు. గారోస్ లో 82వ విజయం… హార్డ్ కోర్ట్ (ఆస్ట్ర్రేలియన్, అమెరికన్ ఓపెన్ ) టెన్నిస్ లో మొనగాడిగా పేరుపొందిన జోకోవిచ్…ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నంబర్ వన్ […]