జోకోవిచ్ 419 వారాల ప్రపంచ నంబర్ వన్ రికార్డు!
ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ నొవాక్ జోకోవిచ్ వేరెవ్వరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. 419 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన మొనగాడిగా నిలిచాడు.
ప్రపంచ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ నొవాక్ జోకోవిచ్ వేరెవ్వరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. 419 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన మొనగాడిగా నిలిచాడు.
ఏటీపీ పురుషుల ర్యాంకింగ్స్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. సెర్బియన్ వండర్ నొవాక్ జోకోవిచ్ జంట రికార్డులతో అరుదైన ఘనత సాధించాడు.
36 ఏళ్ల 321రోజుల వయసులో......
ప్రపంచ పురుషుల టెన్నిస్ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన నొవాక్ జోకోవిచ్ 36 సంవత్సరాల 321 రోజుల వయసులోనూ పురుషుల సింగిల్స్ లో నంబర్ వన్ ర్యాంక్ సాధించడం ద్వారా రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న రికార్డును తిరగరాశాడు.
ఇప్పటి వరకూ స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేరుతో ఉన్న అత్యంత పెద్దవయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన ఆటగాడి రికార్డును జోకోవిచ్ అధిగమించాడు.
419 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన తొలి, ఏకైక ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.
2017 మే 22న 30 సంవత్సరాల వయసులో పడిన జోకోవిచ్ 31 టూర్ టైటిల్స్ గెలుచుకొన్నాడు. తాను సాధించిన 24 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ లో 12 టైటిల్స్ మూడు పదుల వయసులో సాధించినవే కావడం విశేషం.
మొత్తం 40 ఏటీపీ మాస్టర్స్ విజయాలలో 10 టైటిల్స్ సైతం మూడు పదుల వయసులో సాధించినవే కావడం విశేషం.
2011 నుంచి 2024 వరకూ....
జోకోవిచ్ 24 సంవత్సరాల వయసులో ( 2011 జులై 4న ) తొలిసారిగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. రోజర్ ఫెదరర్, రాఫెల్ నడాల్ 22 సంవత్సరాల వయసులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకొంటే...యువఆటగాడు కార్లోస్ అల్ కరాజ్ 19 సంవత్సరాల వయసులోనే నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం విశేషం.
2011 నుంచి 2024 మధ్యకాలంలో 419 వారాలపాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన ఏకైక ఆటగాడు జోకోవిచ్ మాత్రమే.
రోజర్ ఫెదరర్ 310 వారాలపాటు నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం ద్వారా జోకోవిచ్ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు.