Telugu Global
Sports

నితీశ్‌ సెంచరీ.. పవన్‌ ప్రశంస

యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా స్ఫూర్తినివ్వాలని ఎక్స్‌ వేదికగా తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం

నితీశ్‌ సెంచరీ.. పవన్‌ ప్రశంస
X

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో అదరగొట్టిన ఏపీకి చెందిన నితీశ్‌ కుమార్‌ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నితీశ్‌ సాధించిన ఘనతపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

మీరు భారత్‌లోని ఏ ప్రదేశం నుంచి వచ్చారనేది కీలకం కాదు. కానీ దేశం కోసం మీరు ఏం చేశారనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం మీరు మన దేశ గౌరవాన్ని మరింత పెంచారు. డియర్‌.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టులో సెంచరీ సాధించారు. భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. భవిష్యత్తులో మీరు మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆశిస్తున్నా. దేశ గౌరవాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లండి. యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా స్ఫూర్తినివ్వాలి. ఈ సిరీస్‌లో భారత్‌ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పవన్‌ పోస్టు చేశారు.

First Published:  29 Dec 2024 5:08 PM IST
Next Story