Telugu Global
Sports

టెస్టుల్లో నితీశ్‌రెడ్డి తొలి సెంచరీ

మూడో సెషన్‌ ముగిసే సమయానికి 116 రన్స్‌ వెనుకబడి ఉన్న భారత్‌

టెస్టుల్లో నితీశ్‌రెడ్డి తొలి సెంచరీ
X

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (105*) తన టెస్ట్‌ కెరీర్‌లో మొదటి సెంచరీతో సత్తా చాటాడు. అతనితోపాటు సిరాజ్‌ (2*) క్రీజులో ఉన్నారు. బ్యాడ్‌లైటింగ్‌ కారణంగా ఆట ఆగిపోయింది. అప్పటికి భారత స్కోరు 358/9. భారత్‌ ఇంకా 116 రన్స్‌ వెనుకబడి ఉన్నది. సుందర్‌ 50, యశస్వి 82, కోహ్లీ 36, పంత్‌, 28, కేఎల్‌ రాహుల్‌ రన్స్‌ చేశారు. ఆసీస్‌ బౌలర్లలో బోలాండ్‌ 3, కమిన్స్‌ 3 వికెట్లు, నాథన్‌ లైయన్‌ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 రన్స్‌ చేసిన విషయం విదితమే.

వాషింగ్టన్‌ సుందర్‌ హాఫ్‌ సెంచరీ

నితీశ్‌తోపాటు సుందర్‌ (50) కూడా కీలక ఇన్నింగ్‌ ఆడాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన అతను హాఫ్‌ సెంచరీ సాధించాడు. క్రీజులో నిలదొక్కుకున్న సుందర్‌ 146 బాల్స్‌లో హాఫ్‌ సెంచరీ చేశాడు. అతని కెరీర్‌లో ఇది నాలుగో అర్ధశతకం. సెంచరీ హీరో నితీశ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 127 రన్స్‌ భాగస్వామ్యం నిర్మించాడు. నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి 8 వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఒక్క రన్ చేయకుండానే కమిన్స్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

First Published:  28 Dec 2024 12:03 PM IST
Next Story