కేఎల్ రాహుల్ విషయంలో బీసీసీఐ యూటర్న్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలన్న రాహుల్ విజ్ఞప్తి అంగీకరించి.. తర్వాత ఆడాలని కోరిన బోర్డు
ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్ టీ 20, వన్డే సిరీస్‌లను ఆడటానికి సిద్ధమౌతున్నది. జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఉన్నది. ఐసీసీ టోర్నీకి సన్నద్ధంగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తున్నది. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట దానికి అంగీకరించినా.. ఛాంపియన్స్ ట్రోఫీకి అంతగా టైమ్ లేకపోవడంతో అందర్నీ సమాయత్తం చేయడానికి ఏ అవకాశాన్ని వదులుకోకూడదని బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు మొదట రెస్ట్ ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావించింది. కేఎల్ కూడా విశ్రాంతి కావాలని కోరాడు.కానీ ఇప్పుడు బీసీసీఐ మాత్రం పునరాలోచనలో పడింది. వన్డే సిరీస్‌లో ఆడాలని కేఎల్‌ను అడిగింది. ఛాంపియన్స్ ట్రోఫీకి మ్యాచ్ ప్రాక్టీస్ అయినట్లు ఉంటుందని వివరించింది. మరి దానికి కేఎల్ అంగీకరిస్తాడో లేదో చూడాలని అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.