Telugu Global
Sports

రెండో వన్డేలో న్యూజిలాండ్‌ విజయం

సిరీస్‌ సమం చేసిన కివీస్‌..మంగళవారం సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌

రెండో వన్డేలో న్యూజిలాండ్‌ విజయం
X

అహ్మదాబాద్‌ వేదికగా మహిళల మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 76 పరుగుల తేడాతో కివీస్‌ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 9 వికెట్ల నష్టానికి 259 రన్స్‌ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 47.1 ఓవర్లలో 183 రన్స్‌కు ఆలౌటయ్యింది. రాధాయాదవ్‌ (48), సైమా (29), హర్మన్‌ప్రీత్‌ (24) మినహా మిగతా మిగతావారెవ్వరూ పెద్దగా రాణించలేదు. మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది. కీలకమైన సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మూడో మ్యాచ్‌ మంగళవారం అహ్మదాబాద్‌లోనే జరగనున్నది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్‌ సుజియా బేట్స్‌ (58), కెప్టెన్‌ సోఫి డివైన్‌ (79), హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్నారు. మేడీ గ్రీన్‌ (42) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ 4 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ 2, ప్రియా మిశ్రా, సైమా చెరో వికెట్‌ పడగొట్టారు.

First Published:  27 Oct 2024 9:48 PM IST
Next Story