Telugu Global
Sports

ఛాంపియన్స్ ట్రోఫీ.. బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ విజయం

రచిన్‌ రవీంద్ర సూపర్‌ సెంచరీ.. సెమీస్‌కు చేరిన కివీస్‌ జట్టు

ఛాంపియన్స్ ట్రోఫీ.. బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ విజయం
X

ఛాంపియన్స్ ట్రోఫీ.. బంగ్లాదేశ్‌ 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 237 రన్స్‌ లక్ష్యఛేదనలో 46.1 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 240 రన్స్‌ చేసింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన దూకుడుగా ఆడి సెంచరీ పూర్తిచేసుకున్న రచిన్‌ రవీంద్ర 112 రన్స్‌ వద్ద రిషాద్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. మరోవైపు లేథమ్‌ హాఫ్‌ సెంచరీ (55) రాణించాడు. గ్లేన్‌ ఫిలిప్స్‌ (21*) , మైఖేల్ బ్రేస్‌వెల్ (11*) జట్టును విజయపథంలో నడిపించారు. ఇకవరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరింది. పాకిస్థాన్‌ సెమీస్‌ రేస్‌ నుంచి వైదొలిగింది. 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనున్నది. మార్చి 2న న్యూజిలాండ్‌ చివరిలీగ్‌ మ్యాచ్‌ భారత్‌తో ఆడనున్నది.

అంతకుముందుటాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 రన్స్‌ చేసింది. కెప్టెన్‌ నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (77) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో జాకెర్‌ అలీ (45), రిషాద్‌ హుస్సేన్‌ (26) సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడటంతో బంగ్లాదేశ్‌ గౌరప్రదమైన స్కోర్‌ చేయగలిగింది.తంజిద్‌ హసన్‌ (24), మెహదీ హసన్‌ మిరాజ్‌ (13), టస్కిన్‌ అహ్మద్‌ (10) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరగా.. తౌహిద్‌ (7), ముష్పికర్‌ రహీమ్‌ (2), మహ్మదుల్లా (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే వెనుదిరిగారు. ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (3), నహీద్‌ రాణా (0)నౌటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మైకెల్‌ బ్రేస్‌వెల్‌ 4 వికెట్లు తీయగా.. విలియం ఓ రూర్క్‌ 2, కైల్‌ జేమీసన్‌, మ్యాట్‌ హెన్రీ చెరో వికెట్‌ పడగొట్టారు.

First Published:  24 Feb 2025 10:20 PM IST
Next Story