న్యూజిలాండ్ టార్గెట్ 237
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 రన్స్

ఛాంపియన్స్ ట్రోఫీలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 237 రన్స్ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 రన్స్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (77) ఒంటరి పోరాటం చేశాడు. చివర్లో జాకెర్ అలీ (45), రిషాద్ హుస్సేన్ (26) సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో బంగ్లాదేశ్ గౌరప్రదమైన స్కోర్ చేయగలిగింది.
తంజిద్ హసన్ (24), మెహదీ హసన్ మిరాజ్ (13), టస్కిన్ అహ్మద్ (10) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరగా.. తౌహిద్ (7), ముష్పికర్ రహీమ్ (2), మహ్మదుల్లా (4) సింగిల్ డిజిట్ స్కోర్‌కే వెనుదిరిగారు. ముస్తాఫిజుర్ రహమాన్ (3), నహీద్ రాణా (0)నౌటౌట్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకెల్ బ్రేస్‌వెల్ 4 వికెట్లు తీయగా.. విలియం ఓ రూర్క్ 2, కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ చెరో వికెట్ పడగొట్టారు. బంగ్లాదేశ్‌కు ఇది కీలక మ్యాచ్. ఇందులో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. న్యూజిలాండ్ గెలిస్తే.. ఆ జట్టుతో పాటు భారత్ కూడా సెమీస్ వైపు ముందంజ వేస్తుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తాయి.