Telugu Global
Sports

కొత్త కోచ్‌ను నియమించుకున్ననీరజ్‌ చోప్రా

ఐదేళ్లు నీరజ్‌ కు కోచ్‌గా పనిచేసిన క్లాస్‌ బోర్టో నిజ్‌ ఇటీవలే రిటైర్డ్‌

కొత్త కోచ్‌ను నియమించుకున్ననీరజ్‌ చోప్రా
X

జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. జాన్‌ జెలెజ్నీ తన కొత్త కోచ్‌గా నీరజ్‌ నియమించుకున్నారు. గత ఐదేళ్లుగా నీరజ్‌ చోప్రాకు కోచ్‌గా పనిచేసిన జర్మనీకి చెందిన క్లాస్‌ బోర్టో నిజ్‌ కుటుంబ కారణాలతో ఇటీవల రిటైర్డ్‌ అయ్యారు. ఆయన కోచ్‌గా ఉన్నప్పుడే

ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజతం పతకాలు సాధించాడు. క్లాస్‌ రిటైర్మెంట్‌తో నీరజ్‌ తన కొత్త కోచ్‌గా జాన్‌ ను నియమించుకున్నాడు. ఆధునిక యుగంలో గొప్ప జావెలిన్‌ ప్లేయర్‌గా జాన్‌ మూడు సార్లు ఒలింపిక్‌ విజేతగా , మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. జాన్‌ జెలెజ్నీ ని తన ఆరాధ్య ఆటగాడు అని ఆయనతో కలిసి పనిచేసే అవకాశం అదృష్టంగా భావిస్తున్నట్లు నీరజ్‌ చోప్రా తెలిపారు. జావెలిన్‌ త్రో నేర్చుకునే తొలినాళ్లలో జాన్‌ వీడియోలే చూసేవాడిని అని నీరజ్‌ వ్యాఖ్యానించాడు. నీరజ్‌ ఇప్పటివరకు 90 మీటర్లు విసరలేదు. కొత్త కోచ్‌కుగా నియామకమైన జాన్‌ రికార్డు 98. 48 మీటర్లు ఉండటం విశేషం. జాన్‌ కోచింగ్‌లో 90 మీటర్లు దాటుతానని నీరజ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. అటు నీరజ్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్టున్నట్లు జాన్‌ వెల్లడించాడు.

First Published:  9 Nov 2024 3:49 PM GMT
Next Story