నా చిన్న నాటి హీరో విరాట్ కోహ్లీ
మైదానంలోనే కాకుండా బైటా స్ఫూర్తి నింపడంలో కోహ్లీ ముందుంటాడని అబ్రార్ పోస్టు

ఒకే ఒక్క హావభావంతో క్రికెట్ వర్గాల్లో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ చర్చనీయాంశంగా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ను అబ్రార్ క్లీన్‌బోల్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతను చేసిన సైగలు వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో పాక్ చిత్తుగా ఓడిపోయింది. అనంతరం దీనిపై పాక్ ప్రముఖ బౌలర్ వసీం ఆక్రం సహా అబ్రార్ చర్యలను విమర్శించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో టీమిండియాతో గెలిపించాడు. మ్యాచ్ అనంతరం అబ్రార్‌ను కోహ్లీ ప్రశంసించాడు. తాజాగా అబ్రార్ సోషల్ మీడియాలో కోహ్లీని ఉద్దేశించి పోస్టు పెట్టాడు. ' నా చిన్న నాటి హీరో విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. అతను కేవలం మ్యాచ్ సమయంలోనే క్రికెటర్‌గా ఉంటాడు. వ్యక్తిగతంగా చాలా మంచివాడు. మైదానంలోనే కాకుండా బైటా స్ఫూర్తి నింపడంలో కోహ్లీ ముందుంటాడు. అదే అతడిలో గొప్పదనం' అని అబ్రార్ పోస్టు చేశాడు.
వన్డే కెరీర్‌లో విరాట్ కోహ్లీ 300 మ్యాచ్ ఆడటానికి సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్‌తో నేడు టీమిండియా లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ ఆడనున్నది. ఇలాంటి మైలురాయి మ్యాచ్‌ను చూడటానికి విరాట్ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దుబాయ్‌కి చేరుకున్నది. విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ కూడా వచ్చాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత సుమారు 10 రోజుల అనంతరం భారత్ మళ్లీ బరిలోకి దిగుతున్నది.