సచిన్ 30 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టేసిన సర్ఫరాజ్‌ఖాన్ తమ్ముడు
సచిన్ టెండూల్కర్ తన 21 ఏళ్ల 11 నెలల వయసులో 1994-95 సీజన్‌లో పంజాబ్‌పై ఫైనల్‌లో సెంచరీ సాధించాడు. ముషీర్ 19 ఏళ్ల 255 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసి వన్డే స్టయిల్లో బ్యాటింగ్‌తో ధనాధనా పరుగులు రాబట్టాడు సర్ఫరాజ్‌ఖాన్. మరోవైపు అతని తమ్ముడు ముషీర్‌ఖాన్ రంజీట్రోఫీలో దుమ్ము లేపేస్తున్నాడు. ముంబయితో ఆడుతూ ఇప్పటికే ఈ సీజన్‌లో ఓ డబుల్ సెంచరీకూడా చేసిన ముషీర్.. విదర్భతో జరుగుతున్న ఫైనల్లో ఏకంగా క్రికెట్ దేవుడి టెండూల్కర్ రికార్డునే తుడిచిపెట్టేశాడు.
ముంబై, విదర్భ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మూడో రోజు ముషీర్ ఖాన్ 136 పరుగులు చేసి, ఔటయ్యాడు. రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబై తరఫున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ముషీర్ 19 ఏళ్ల 14 రోజుల వయసులో సెంచరీ సాధించాడు.
30 ఏళ్ల రికార్డు బద్దలు
సచిన్ టెండూల్కర్ తన 21 ఏళ్ల 11 నెలల వయసులో 1994-95 సీజన్‌లో పంజాబ్‌పై ఫైనల్‌లో సెంచరీ సాధించాడు. ముషీర్ 19 ఏళ్ల 255 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీ సాధించినప్పుడు సచిన్ టెండూల్కర్ స్టేడియంలో కూర్చుని ఈ మ్యాచ్ చూస్తుండడం విశేషం. అంటే క్రికెట్ దేవుడు 30 ఏళ్ల కిందట సృష్టించిన రికార్డును ఆయన ముందే తిరగరాశాడు ముషీర్‌ఖాన్.