Telugu Global
Sports

ధోని షాకింగ్ డెసిషన్‌.. CSK కెప్టెన్‌గా రుతురాజ్‌

నిజానికి 2022లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ధోని నిర్ణయం తీసుకున్నాడు. ఆ సీజన్‌ ఆరంభంలో ధోని సూచనలతో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించిన చెన్నై మేనేజ్‌మెంట్ అందుకు మూల్యం చెల్లించుకుంది.

ధోని షాకింగ్ డెసిషన్‌.. CSK కెప్టెన్‌గా రుతురాజ్‌
X

చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు. శుక్రవారం నుంచి ఐపీఎల్ - 2024 సీజన్ ప్రారంభం కానుండగా ధోని నిర్ణయం సంచలనంగా మారింది. రేపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తొలి మ్యాచ్‌ ఆడనుంది చెన్నై సూపర్ కింగ్స్‌.


నిజానికి 2022లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ధోని నిర్ణయం తీసుకున్నాడు. ఆ సీజన్‌ ఆరంభంలో ధోని సూచనలతో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించిన చెన్నై మేనేజ్‌మెంట్ అందుకు మూల్యం చెల్లించుకుంది. కెప్టెన్‌గా ఏ మాత్రం అనుభవం లేని జడేజా తీవ్ర ఒత్తిడికి లోనై ఫెయిల్ అయ్యాడు. దీంతో జడేజా కెప్టెన్సీపై వేటు వేసిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తిరిగి ధోనీకే సారథ్య బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం 42 ఏళ్లు పూర్తి చేసుకున్న ధోని టోర్నమెంట్‌ పాల్గొనడం ఇప్పటికే అనేక పుకార్లు ప్రచారమవుతున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న తాజా నిర్ణయంతో ధోనికి ఇదే చివరి టోర్నమెంట్‌ అనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.

ధోని కెప్టెన్సీలో ఇప్పటివరకూ 5 ఐపీఎల్ టైటిల్స్ సాధించింది సీఎస్కే. 2010, 2011, 2018, 2021, 2023లో విజేతగా నిలిచింది. ధోని నాయకత్వంలో 2010, 14 ఛాంపియన్స్ లీగ్ టీ-20లోనూ విజేతగా నిలిచింది. CSK తరపున 250 ఐపీఎల్‌ మ్యాచులాడిన ధోని.. 38.79 సగటుతో 5082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

First Published:  21 March 2024 11:43 AM GMT
Next Story