Telugu Global
Sports

ఇంగ్లండ్‌ తో టీ 20 సిరీస్‌.. టీమ్‌లో మహ్మద్‌ షమీ

వైస్‌ కెప్టెన్‌ గా అక్షర్‌ పటేల్‌, గిల్‌, పంత్‌, జైస్వాల్‌ కు రెస్ట్‌

ఇంగ్లండ్‌ తో టీ 20 సిరీస్‌.. టీమ్‌లో మహ్మద్‌ షమీ
X

ఇంగ్లండ్‌ తో ఐదు టీ 20ల సిరీస్‌ లో తలపడే భారత జట్టును సెలక్షన్‌ కమిటీ శనివారం ప్రకటించింది. 14 నెలల విరామం తర్వాత ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీకి టీమ్‌ లో చోటు దక్కింది. సుదీర్ఘకాలంగా క్రికెట్‌ ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, యసశ్వీ జైస్వాల్‌ కు రెస్ట్‌ ఇచ్చారు. సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని యంగ్‌ ఇండియాకు అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌ గా వ్యవహరిస్తారు. సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్థిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, నితీశ్ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, వాష్టింగన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురేల్‌ (వికెట్‌ కీపర్‌)కు జట్టులో చోటు దక్కింది. జట్టులో శివమ్‌ దుబేకు చోటు దక్కలేదు. ఐదు టీ20లు, మూడు వన్‌డేల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ టీమ్‌ భారత్‌లో పర్యటిస్తుంది. ఈనెల 22న కోల్‌కతా వేదికగా ఫస్ట్‌ టీ20 మ్యాచ్‌ జరుగుతుంది. 25న చెన్నైలో, 28న రాజ్‌కోట్‌లో, 31న పూణేలో, ఫిబ్రవరి 2న ముంబయిలో టీ 20 మ్యాచ్‌ లు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌ లు సాయంత్రం 7 గంటలకు మొదలవుతాయి.

First Published:  11 Jan 2025 8:51 PM IST
Next Story