Telugu Global
Sports

ఐపీఎల్‌ మెగా వేలం నిర్వహించేది ఆమె!

జెడ్డాలో వేలం నిర్వహించనున్న మల్లికా సాగర్‌

ఐపీఎల్‌ మెగా వేలం నిర్వహించేది ఆమె!
X

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది. సౌది అరెబియాలోని జెడ్డా వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో మెగా వేలం నిర్వహించనున్నారు. ప్రముఖ ఆక్షనీర్‌ మల్లికా సాగర్‌ ఈసారి ఐపీఎల్‌ మెగా వేలం నిర్వహించనున్నారు. ఈనెల 24న మధ్యాహ్నం 12.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు) మల్లికా సాగర్‌ మెగా ఆక్షన్‌ ప్రారంబిస్తారు. రెండు రోజుల పాటు ఆమె వేలం నిర్వహిస్తారు. ఐపీఎల్‌ లోని అన్ని ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొని తమ టీమ్‌ కు అవసరమైన ప్లేయర్లను వేలంలో దక్కించుకోనున్నాయి. ఈసారి ఐపీఎల్‌ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ఇండియన్‌ క్యాప్డ్‌ ప్లేయర్స్‌ 48 మంది ఉండగా, అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్స్‌ 318 మంది ఉన్నారు. ఓవర్సీస్‌ క్యాప్డ్‌ ప్లేయర్స్‌ 193 మంది ఉండగా, అన్‌ క్యాప్డ్‌ ఓవర్సీస్‌ ప్లేయర్స్‌ 12 మంది ఉన్నారు. అసోసియేట్‌ ప్లేయర్స్‌ మరో ముగ్గురు ఉన్నారు.




First Published:  15 Nov 2024 8:13 PM IST
Next Story