లంచ్ బ్రేక్.. న్యూజిలాండ్ స్కోర్ 92/3
కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న భారత బౌలర్లు.. సుందర్‌కు రెండు వికెట్లు
BY Raju Asari1 Nov 2024 6:47 AM GMT
X
Raju Asari Updated On: 1 Nov 2024 6:47 AM GMT
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తున్నారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ 3 వికెట్లు కోల్పోయి 90 రన్స్ చేసింది. క్రీజ్‌లో విల్‌యంగ్ (38 నాటౌట్), డారిల్ మిచెల్ (11 నాటౌట్) ఉన్నారు. డేంజరస్ ఓపెనర్ డేవన్ కాన్వే (4) యువ పేసర్ ఆకాశ్‌దీప్ ఔట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. వాషింగ్టన్ సుందర్, జడేజా పదునైన బౌలింగ్‌తో కివీస్‌ను అడ్డుకున్నారు. ఆతిథ్య జట్టు కెప్టెన్ టామ్ లేథమ్ (28), రచిన్ రవీంద్రను సుందర్ ఔట్ చేశాడు. వీరిద్దరినీ బౌల్డ్ చేయడం విశేషం. అనంతరం డారిల్ మిచెల్‌తో కలిసి విల్ యంగ్ మరో వికెట్ ఇవ్వకుండా తొలి సెషన్ ముగించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏడు ఓవర్లలో 20 రన్స్ జోడించారు.
Next Story