Telugu Global
Sports

లంచ్‌ బ్రేక్‌.. భారత్‌ 3 వికెట్లు డౌన్‌

మళ్లీ విఫలమైన ఓపెనర్లు.. రోహిత్‌కు విశ్రాంతి.. కెప్టెన్‌ గా బుమ్రా

లంచ్‌ బ్రేక్‌.. భారత్‌ 3 వికెట్లు డౌన్‌
X

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌, భారత్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతున్నది. సిడ్నీ వేదికగా చివరి టెస్టు ప్రారంభమైంది. చివరి టెస్టులో రోహిత్‌కు స్థానం దక్కలేదు. ఈమ్యాచ్‌లో బూమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే సిడ్నీ టెస్టు నుంచి రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇచ్చినా.. జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు లేదు. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్‌కు చేరారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (20) లంచ్‌ బ్రేక్‌ కు ముందు ఔటయ్యాడు. ప్రస్తుతం తొలి సెషన్‌ ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 57 రన్స్‌చేసింది. స్వల్ప వ్యవధిలోనే భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌(4), యశస్వి జైస్వాల్‌ 910) విఫలమయ్యారు. విరాట్‌ కోహ్లీ (12 నౌటౌట్‌) నెమ్మదిగా ఆడుతున్నాడు.

ఒక్క బాల్‌ ఆడితే లంచ్‌ బ్రేక్.. కానీ భారత్‌కు షాక్‌ తగిలింది. అప్పటివరకు నిలకడగా ఆడిన గిల్‌ లయ తప్పాడు. నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుకదిరాడు.అంతకుముందు టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నది. చివరి టెస్టులో అందరూ ఊహించినట్లుగానే రోహిత్‌ శర్మ స్థానం కోల్పోయాడు. రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్‌ బూమ్రా వెల్లడించాడు. అలాగే కోహ్లీకి లక్‌ కలిసి వచ్చింది. బోలాండ్‌ బౌలింగ్‌లో మొదటి బాల్‌కే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్మిత్‌ బంతిని విసిరేసే సమయంలో నేలకు తాకినట్లు భావించిన థర్డ్‌ అంపైర్‌. సమీక్షలో నాటౌట్‌గా తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  3 Jan 2025 7:38 AM IST
Next Story