Telugu Global
Sports

చాంపియన్స్‌ ట్రోఫీకి లైన్‌ క్లియర్‌

హైబ్రిడ్‌ మోడల్‌ కు ఓకే చెప్పిన పాకిస్థాన్‌

చాంపియన్స్‌ ట్రోఫీకి లైన్‌ క్లియర్‌
X

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఒక్క చాంపియన్స్‌ ట్రోఫీకే పరిమితం కాకుండా 2031 వరకు జరిగే అన్ని టోర్నీల్లో తమ జట్టు ఇండియాతో దుబయి వేదికగా తలపడేందుకు అనుమతి ఇవ్వాలని పాక్ కోరింది. పాకిస్థాన్‌ వేదికగా నిర్వహించే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ -2025లో పాల్గొనేది లేదని ఇండియా గతంలోనే తేల్చిచెప్పింది. పాకిస్థాన్‌ లో క్రికెటర్ల భద్రత దృష్ట్యా ఆ దేశానికి టీమ్‌ పంపేందుకు భారత ప్రభుత్వం కూడా ససేమిరా అంది. ఇండియా లేకుండా టోర్నీ నిర్వహించేందుకు ఐసీసీ వెనుకంజ వేసింది. హైబ్రిడ్‌ మోడల్‌ లో టోర్నీ నిర్వహణకు ఓకే అంటే ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని పాక్‌ క్రికెట్‌ బోర్డుకు ఐసీసీ బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చింది. శుక్రవారం వరకు హైబ్రిడ్‌ మోడల్‌ కు ససేమిరా అన్న పాకిస్థాన్‌.. టోర్నీని మరో దేశానికి తరలిస్తామనే ఐసీసీ హెచ్చరికలతో దిగివచ్చింది. దుబయి వేదికగా భారత్‌ ఆడే మ్యాచ్‌ల నిర్వహణకు ఒప్పుకుంది. దీంతో చాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ ను ఖరారు చేసే ప్రయత్నాల్లో ఐసీసీ నిమగ్నమయ్యింది. శనివారం సాయంత్రం పాక్‌ క్రికెట్‌ బోర్డుతో ఐసీసీ నిర్వహించిన సమావేశంలో హైబ్రిడ్‌ మోడల్‌ కు పాక్‌ ఒప్పుకోవడంతో పాటు 2031 వరకు అదే ఫార్ములాను కొనసాగించాలని పాక్‌ విజ్ఞప్తి చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో చాంపియన్స్‌ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో ఇండియా ఫైనల్‌ కు చేరితే ఫైనల్‌ మ్యాచ్‌ దుబయిలో నిర్వహిస్తారు.

First Published:  30 Nov 2024 5:17 PM IST
Next Story