ఐపీఎల్ -17 వీక్షకులు 62 కోట్లు!
ఐపీఎల్ -16వ సీజన్ మ్యాచ్ లను జియో సినిమా వేదికగా 449 మిలియన్ల మంది ప్రత్యక్షప్రసారాల ద్వారా వీక్షించారు. వీక్షకులు సంఖ్య 44 కోట్ల 90 లక్షల నుంచి 62 కోట్లకు చేరడం ద్వారా సరికొత్త రికార్డు నమోదయ్యింది.
ఐపీఎల్ పలు విధాలుగా తన రికార్డులను తానే అధిగమించుకొంటూ ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన క్రికెట్ లీగ్ గా సత్తా చాటుకొంది.
భారతగడ్డపై కొద్దిరోజుల క్రితమే అత్యంత విజయవంతంగా ముగిసిన ఐపీఎల్ -17వ సీజన్ పలు సరికొత్త రికార్డులు నెలకొల్పింది. క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు..ప్రత్యక్షప్రసారాల పరంగా కూడా ఓ అసాధారణ రికార్డు నెలకొల్పింది.
32 శాతం పెరిగిన వీక్షకులు...
దేశంలోని 11 వేదికల్లో 74 మ్యాచ్ లుగా 7వారాలపాటు సాగిన ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలను గత 16 సీజన్లలో ఎన్నడూ లేని విధంగా 62 కోట్ల మంది వీక్షించినట్లు వయాకోమ్18 ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు.
జియో సినిమా ఫ్లాట్ ఫామ్ గా జరిగిన ఈ 74 మ్యాచ్ ల ప్రత్యక్షప్రసారాలను 62 కోట్ల మంది వీక్షించారని, గత సీజన్ ( 2023 )తో పోల్చిచూస్తే ఇది 32 శాతం అదనమని తెలిపారు.
ఐపీఎల్ -16వ సీజన్ మ్యాచ్ లను జియో సినిమా వేదికగా 449 మిలియన్ల మంది ప్రత్యక్షప్రసారాల ద్వారా వీక్షించారు. వీక్షకులు సంఖ్య 44 కోట్ల 90 లక్షల నుంచి 62 కోట్లకు చేరడం ద్వారా సరికొత్త రికార్డు నమోదయ్యింది.
ఐపీఎల్ ప్రత్యక్షప్రసారాల అధికారిక బ్రాడ్ కాస్టర్ గా ఉన్న జియా సినిమాకు 2600 వ్యూస్ వచ్చాయి. గత సీజన్ తో పోల్చితే ఇది 53 శాతం అదనం.
జియా సినిమా వేదికగా మొత్తం 12 భాషలలో ప్రత్యక్షప్రసారాలను అత్యధికమంది వీక్షించారు.
గత ఐపీఎల్ లో వీక్షించిన సగటు సమయం 60 నిముషాలు కాగా..ప్రస్తుత ఐపీఎల్ లో అదికాస్త 75 నిముషాలకు పెరిగింది. ప్రత్యక్షప్రసారాల నాణ్యత కూడా దీనికి కారణమని వయాకోమ్ 18 ప్రతినిధి వివరించారు.
ఐపీఎల్ ప్రత్యక్షప్రసారాలు కొత్తపుంతలు తొక్కడానికి , సరికొత్త రికార్డులు నమోదు చేయటానికి స్పాన్సర్లు, వివిధ ఫ్రాంచైజీల యజమానులు, క్రికెటర్లు, ఇతర సిబ్బంది కారణమని, వారందరికీ రుణపడి ఉంటామని తెలిపారు.
వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ -18 ప్రత్యక్ష ప్రసారాల నాణ్యతను మరింతగా పెంచుతామని ప్రకటించారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు 350 కోట్ల రూపాయల మేర స్పాన్సర్లను సంపాదించడం కూడా విశేషం.