ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో కుర్ర విజేత సిన్నర్ !
2024- గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టో్ర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సంచలనాలతో ముగిసింది. 22 ఏళ్ల జన్నిక్ సిన్నర్ విజేతగా నిలవడం ద్వారా యువచాంపియన్ గా నిలిచాడు.
2024- గ్రాండ్ స్లామ్ సీజన్ తొలి టో్ర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సంచలనాలతో ముగిసింది. 22 ఏళ్ల జన్నిక్ సిన్నర్ విజేతగా నిలవడం ద్వారా యువచాంపియన్ గా నిలిచాడు...
ఆస్ట్ర్రేలియా వాణిజ్యరాజధాని మెల్బోర్న్ వేదికగా గత మూడువారాలుగా సాగిన 2024- సీజన్ గ్రాండ్ స్లామ్ తొలి టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పలు అరుదైన రికార్డులకు, సంచలనాలకు వేదికగా నిలిపింది.
పురుషుల డబుల్స్ లో 38 సంవత్సరాల రోహన్ బొపన్నజోడీ విజేతగా అవతరిస్తే..సింగిల్స్ లో మాత్రం 22 సంవత్సరాల జన్నిక్ సిన్నర్ నవ,యువ చాంపియన్ గా తెరమీదకు వచ్చాడు.
ఫైనల్లో పాపం! మెద్వదేవ్.....
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో ఫైనల్స్ కు చేరడం, రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోడం రష్యన్ స్టార్ , ప్రపంచ మూడో ర్యాంక్ ప్లేయర్ డానిల్ మెద్వదేవ్ కు ఓ అలవాటుగా, దురదృష్టంగా మారింది. ప్రస్తుత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సైతం అదే ఆనవాయితీ కొనసాగింది.
మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా 3 గంటల 44 నిముషాలపాటు హోరాహోరీగా సాగిన పోరులో 3వ సీడ్ మెద్వదేవ్ ను అదృష్టం వెక్కిరిస్తే...4వ సీడ్ జన్నిక్ సిన్నర్ ను విజయం వరించింది.
ఐదుసెట్ల ఈ సమరంలో 6-3, 6-3తో మొదటి రెండుసెట్లూ నెగ్గి టైటిల్ ఖాయమనుకొన్న మెద్వదేవ్ ను సిన్నర్ తన ఫైటింగ్ టెన్నిస్ తో కంగు తినిపించాడు. చివరి మూడుసెట్లను 6-4, 6-4, 6-3తో నెగ్గడం ద్వారా సంచలన విజయం సాధించాడు.
అప్పుడు జోకో...ఇప్పుడు సిన్నర్...
గత దశాబ్దకాలంలో కేవలం 22 సంవత్సరాల వయసులోనే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ విన్నర్ గా నిలిచిన రెండో ఆటగాడిగా సిన్నర్ రికార్డుల్లో చేరాడు. పదిసార్లు విజేత నొవాక్ జోకోవిచ్ తరువాత అత్యంత పిన్నవయసులో ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కుర్ర ప్లేయర్ గా సిన్నర్ గుర్తింపు తెచ్చుకొన్నాడు.
2022 ఆస్ట్ర్రేలియన్ ఓెపెన్ టైటిల్ పోరులో రాఫెల్ నడాల్ చేతిలో ఓటమి పొందిన మెద్వదేవ్ కు 2024 ఫైనల్లో సిన్నర్ చేతిలో పరాజయం తప్పలేదు.
ఫైనల్ చేరే క్రమంలో మెద్వదేవ్ మూడు రౌండ్ల మ్యాచ్ లను ఆరుగంటలపాటు పోరాడి..ఐదుసెట్ల విజయాలు సాధించిన మొనగాడిగా ఉన్నా..టైటిల్ పోరులో మాత్రం సఫలం కాలేకపోయాడు.
నిర్ణయాత్మక ఆఖరి సెట్లో సిన్నర్ మూడు ఏస్ లతో పాయింట్ వెంట పాయింట్ సాధించడం ద్వారా టైటిల్ ఖాయం చేసుకోగలిగాడు. గత దశాబ్దకాలంలో ఆస్ట్ర్రేలయిన్ ఓపెన్ విన్నర్ గా నిలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్ గా సిన్నర్ చరిత్ర సృష్టించాడు.
సిన్నర్ కెరియర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా..ట్రోఫీతో పాటు 2,130,975 వేల ఆస్ట్ర్రేలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా అందుకొన్నాడు. రన్నరప్ మెద్వదేవ్ 1,166,963 వేల డాలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ చరిత్రలోనే తిరుగులేని చాంపియన్ గా నిలిచిన 10సార్లు విజేత నొవాక్ జోకోవిచ్ ఆధిపత్యానికి సిన్నర్ గండి కొట్టడం..2024 టోర్నీ హైలైట్ గా మిగిలిపోతుంది.