కాసేపట్లో ఐపీఎల్ -2025 షెడ్యూల్
సాయంత్రం 5:30 గంటలకు ప్రకటించనున్న ఐపీఎల్ గవర్నింగ్ బాడీ
BY Naveen Kamera16 Feb 2025 3:49 PM IST

X
Naveen Kamera Updated On: 16 Feb 2025 3:49 PM IST
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 లీగ్ కు కౌంట్ డౌన్ షురువయ్యింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ఐపీఎల్ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఐపీఎల్ అఫీషియల్ షెడ్యూల్ ను ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ప్రకటించనుంది. స్టార్ స్పోర్ట్స్ చానెళ్లతో పాటు స్పోర్ట్స్ 18, జీయో హాట్ స్టార్‌లోనూ షెడ్యూల్ ఎనౌన్స్‌మెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మార్చి 22వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రారంభమ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టబోతుంది. ఈడెన్ గార్డెన్స్ ప్రారంభ ఈవెంట్ తో పాటు మొదటి మ్యాచ్ కు వేదిక కానుంది. మొత్తం జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడబోతున్నాయి.
Next Story