విండీస్‌పై భారత్ విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
టీమిండియా బౌలర్లు దీప్తి శర్మ (6/31), రేణుకా ఠాకూర్ (4/29) దెబ్బకు విండీస్ కుదేలు
విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా.. 28.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. దీప్తి శర్మ (39*) రాణించింది. డీన్ డ్రా డాటిన్, ఆలియా, మ్యాథ్యూస్, ప్లెచ్చర్, కరిష్మా చెరో వికెట్ తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 162 రన్స్‌కు ఆలౌట్ అయింది. దీప్తి శర్మ 6, రేణుకా సింగ్ 4 వికెట్లు పడగొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ బ్యాటర్లలో చినిల్లె హెన్రీ (61) హాఫ్ సెంచరీ సాధించగా.. క్యాంప్‌బెల్లె (46), ఆలియా అలెన్ (21) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్లు క్వియానా జోసెఫ్ (0), హీలే మాథ్యూస్ (0) డకౌట్ కావడం విశేషం. వీరిద్దరిని తొలి ఓవర్‌లోనే రేణుకా ఔట్ చేసింది. టీమిండియా బౌలర్లు దీప్తి శర్మ (6/31), రేణుకా ఠాకూర్ (4/29) దెబ్బకు విండీస్ కుదేలైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది.