Telugu Global
Sports

ప్రపంచ ఫుట్ బాల్ ర్యాంకింగ్స్ లో పాతాళానికి భారత్!

ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో భారత్ స్థానం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. గత ఏడేళ్ల కాలంలో అత్య్తంత చెత్త ర్యాంకును మూటగట్టుకొంది...

ప్రపంచ ఫుట్ బాల్ ర్యాంకింగ్స్ లో పాతాళానికి భారత్!
X

ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో భారత్ స్థానం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. గత ఏడేళ్ల కాలంలో అత్య్తంత చెత్త ర్యాంకును మూటగట్టుకొంది...

జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందుతున్న నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో మాత్రం అట్టడుగుకు పడిపోయింది.

అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ గత ఏడేళ్ల కాలంలో అత్యంత చెత్త ర్యాంకును మూటగట్టుకొంది.

204 దేశాలలో 117వ స్థానం..

అంతర్జాతీయ ఫుట్ బాల్ (పిఫీ ) సమాఖ్యలో ఈ భూఖండంలోని 204 దేశాలకు సభ్యత్వం ఉంది. ఆటతీరు, ప్రదర్శన, విజయాలను బట్టి వివిధజట్లకు పిఫా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది.

అయితే..భారత్ లోని ఓ రాష్ట్ర్రమంతైనా లేదా..ఓ నగరమైనంతైనా లేని దేశాలు అత్యుత్తమ ర్యాంకుల్లో నిలిస్తే భారత్ మాత్రం తాజా ర్యాంకింగ్స్ ప్రకారం 117వ ర్యాంకుకు దిగజారిపోయింది.

సునీల్ చెత్రీ నాయకత్వంలోని భారత్ కు ఇగోర్ స్టిమాక్ చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. గత కొద్దిమాసాలుగా జరిగిన అంతర్జాతీయ పోటీలలో భారత్ వరుస పరాజయాలు చవిచూడటంతో 98వ ర్యాంక్ నుంచి 117వ ర్యాంక్ కు పడిపోయింది.

ఆసియాకప్ లో భారత్ వరుస పరాజయాలు..

ఇటీవలే ముగిసిన ఆసియాకప్ క్వాలిఫైయింగ్ పోటీలలో భారతజట్టు కనీసం ఒక్కగోలూ సాధించకపోగా ఆస్ట్ర్రేలియా చేతిలో 0-2, ఉజ్బకిస్థాన్ చేతిలో 0-3, సిరియా పై 0-1 గోల్స్ తో ఓడి 15 ర్యాంకుల దిగువకు పడిపోయింది.

గత ఏడుసంవత్సరాల కాలంలో భారత్ సాధించిన అత్యంత చెత్త ర్యాంకు ఇదే కావటం విశేషం. 2017 జనవరిలో 129వ ర్యాంకులో ఉన్న భారత్ ..2015లో 173వ ర్యాంక్ సాధించింది.

2023 డిసెంబర్ 21 102వ ర్యాంకు, ఆ తర్వాత 98వ ర్యాంకుల్లో నిలిచిన భారత్ 2023 డిసెంబర్ నాటికి 117వ ర్యాంక్ కు దిగజారిపోయింది. వరుస పరాజయాల దెబ్బతో భారత్ ఏకంగా 35.63 పాయింట్లు నష్టపోయింది.

ప్రపంచంలోని అతిబుల్లి దేశాలలో ఒకటైన టోగో 116వ ర్యాంకులో ఉంటే భారత్ 117వ ర్యాంకు సంపాదించింది. భారత్ తర్వాతి స్థానంలో గినీ బిసావు 118వ ర్యాంకులో కొనసాగుతోంది.

ఆసియాదేశాలలో భారత ర్యాంకు 22

45 దేశాలతో కూడిన ఆసియాఖండ ఫుట్ బాల్ ర్యాంకింగ్స్ లో భారత్ 22వ స్థానంలో ఉంది. పిఫా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా నంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఫ్రాన్స్, ఇంగ్లండ్, బెల్జియం, బ్రెజిల్ మొదటి ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. ఆసియాఖండంలోని అతిచిన్నదేశాలలో ఒకటైన ఖతర్ 21 స్థానాల మేర తన ర్యాంకును మెరుగుపరచుకొని 37వ ర్యాంక్ కు చేరుకోగలిగింది.

జపాన్ ప్రస్తుత 17వ ర్యాంక్ నుంచి 18వ ర్యాంక్ కు పడిపోయింది. ఆసియాకప్ రన్నరప్ జోర్డాన్ 17 స్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకొని 70వ ర్యాంకు సాధించగలిగింది.

First Published:  19 Feb 2024 9:00 AM IST
Next Story