టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
చివరి మ్యాచ్ లోనైనా గెలిచి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించాలని చూస్తున్నభారత మహిళా జట్టు
ఆస్ట్రేలియా-భారత మహిళల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనున్నది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ బౌలింగ్ ఎంచుకున్నది. ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ఇప్పటికే కోల్పోయింది. చివరి మ్యాచ్లోనైనా గెలిచి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించాలని భారత మహిళా జట్టు చూస్తున్నది. మరోవైపు ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఇక టీమిండియా ఇద్దరిని పక్కనపెట్టి మరో ఇద్దరిని తుది జట్టులోకి తీసుకున్నది. ప్రియా పునియాకి ఎడమ మోకాలికి గాయం కారణంగా ఆమెకు రెస్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్రియా మిశ్రాను కూడా మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది.
11 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. ఫోయిబ్ లిచ్‌ఫీల్డ్ 25 రన్స్ చేసి అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో కీపర్ రిచా ఘాష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. జార్జియా వోల్ కూడా 26 రన్స్ చేసి అరుంధతి రెడ్డి బౌలింగ్ బౌడ్డ్ అయ్యింది. ప్రస్తుతం క్రీజులో ఎలీసా పెర్రీ (1), బెత్‌మూనీ (3) ఉన్నారు.
తుది జట్లు
భారత్: స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడిగ్స్, రిచా ఘాష్ (కీపర్), దీప్తి శర్మ, మిన్ను మనణి, సైమా ఠాకూర్, రేణుకా ఠాకూర్, అరుంధతి రెడ్డి, టిటాస్ సధు
IND-W vs AUS-W: ఫోయిబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీసా పెర్రీ, బెత్‌మూనీ (కీపర్), అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ, అలానా కింద్, కిమ్ గార్త్, మెగాన్ స్కట్