తొలి వన్డేలో భారత్ విజయం
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 59 రన్స్ తేడాతో గెలుపు
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 59 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 40.4 ఓవర్లలో 168 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. బ్రూక్ (39), మ్యాడీ గ్రీన్ (31) తప్పా మిగిలిన వారెవరూ రాణించలేదు. భారత బౌలర్లు రాధా యాదవ్ 3, సైమా 2, దీప్తి శర్మ, అరుంధతి తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తేజ్ హసబ్నిస్ (42), దీప్తి శర్మ (41), యస్తికా భాటియా (37), జెమీమా రోడ్రిగ్స్ (35), షెఫాలీ వర్మ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ 4, జెస్ కెర్ 3, కార్సన్ 2, సుజీ బేట్స్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరంగా ఉండటంతో స్మృతి మంధాన ఆ బాధ్యతలు చేపట్టింది.