Telugu Global
Sports

సఫారీటెస్టులో దిగ్గజాల రికార్డుకు విరాట్ గురి!

భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో దిగ్గజాల రికార్డుకు గురిపెట్టాడు. దక్షిణాఫ్రికాతో రెండుమ్యాచ్ ల సిరీస్ లో సత్తా చాటుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

సఫారీటెస్టులో దిగ్గజాల రికార్డుకు విరాట్ గురి!
X

భారత క్రికెట్ నయామాస్టర్ విరాట్ కొహ్లీ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో దిగ్గజాల రికార్డుకు గురిపెట్టాడు. దక్షిణాఫ్రికాతో రెండుమ్యాచ్ ల సిరీస్ లో సత్తా చాటుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ 2023 సీజన్ ను అత్యంత విజయవంతంగా ముగించాలన్న లక్ష్యంతో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా..జోహెన్స్ బర్గ్ సెంచూరియన్ పార్క్ వేదికగా ప్రారంభమైన తొలిటెస్టులో అరుదైన రికార్డులకు గురిపెట్టాడు.

ద్రావిడ్, వీరూ రికార్డులే లక్ష్యంగా...

సఫారీగడ్డపై దక్షిణాఫ్రికాతో కనీసం ఒక్క టెస్టు సిరీస్ విజయమూలేని భారత్ ఆ లోటును ప్రస్తుత సిరీస్ ద్వారా పూడ్చుకోవాలని భావిస్తోంది. పూర్తిస్థాయిజట్టుతో బరిలోకి దిగిన భారత్ కు నయా మాస్టర్ విరాట్ కొహ్లీ బ్యాటింగ్ కీలకం కానుంది.

దీనికితోడు..సఫారీజట్టులో పలువురు కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడటం, క్వింటన్ డి కాక్ లాంటి ప్రపంచ మేటి రిటైర్మెంట్ ప్రకటించడం భారత్ విజయావకాశాలకు ఊతమిస్తున్నాయి.

దక్షిణాఫ్రికా పై 14 టెస్టుల్లో 1236 పరుగులు...

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా ప్రస్తుత సిరీస్ కు ముందు వరకూ 14 టెస్టులు ఆడిన విరాట్ కొహ్లీకి 1236 పరుగులతో 56.18 సగటు సాధించిన రికార్డు ఉంది.

భారత్ తరపున సఫారీలపై నాలుగో అత్యుత్తమ బ్యాటర్ గా విరాట్ కొనసాగుతున్నాడు. సెంచూరియన్ పార్క్ వేదికగా ప్రారంభమైన తొలిటెస్టులో విరాట్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం ద్వారా రాహుల్ ద్రావిడ్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. దక్షిణాఫ్రికా పై ద్రావిడ్ సాధించిన 1252 పరుగుల రికార్డును విరాట్ బ్రేక్ చేయగలిగాడు.

ప్రస్తుత టెస్టులో వ్యక్తిగతంగా 70 పరుగులు సాధించగలిగితే వీరేంద్ర సెహ్వాగ్ రికార్టును సైతం విరాట్ అధిగమించే అవకాశం ఉంది. వీరేంద్ర సెహ్వాగ్ తన కెరియర్ లో సఫారీలపై ఆడిన 15 టెస్టుల్లో 1306 పరుగులు సాధించడం ద్వారా భారత రెండో అత్యుత్తమ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.

రాహుల్ ద్రావిడ్ ను మించిన విరాట్...

రాహుల్ ద్రావిడ్ 1205 పరుగుల స్కోరును తెరమరుగు చేయడం ద్వారా దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు సాధించిన భారత మూడో బ్యాటర్ గా నిలిచిన విరాట్...మాస్టర్ సచిన్ రికార్డును సైతం అధిగమించే అవకాశాలు లేకపోలేదు.

మాస్టర్ సచిన్ తన కెరియర్ లో దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా ఆడిన మొత్తం 25 టెస్టుల్లో 1741 పరుగులు సాధించడం ద్వారా భారత నంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. సచిన్ కు 42.46 సగటు ఉంది.

సచిన్ అత్యధిక పరుగుల రికార్డును విరాట్ అధిగమించాలంటే ప్రస్తుత రెండుమ్యాచ్ ల సిరీస్ లోని నాలుగు ఇన్నింగ్స్ లో మరో 505 పరుగులు సాధించగలిగితే దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు సాధించిన భారత టెస్టు బ్యాటర్ రికార్డును విరాట్ అందుకోగలుగుతాడు.

ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టులో భారత ఓపెనర్లు విరాట్, యశస్వి, వన్ డౌన్ శుభ్ మన్ గిల్ విఫలమైనా..విరాట్- శ్రేయస్ అయ్యర్ 4వ వికెట్ కు కీలక భాగస్వామ్యంతో పరిస్థితిని చక్కదిద్ద గలిగారు.

First Published:  26 Dec 2023 4:00 PM IST
Next Story