భారత్ వర్సెస్ న్యూజిలాండ్: వర్షం కారణంగా టాస్ ఆలస్యం
మొదటిరోజు మొదటి సెషన్ ఆట సాధ్యపడటం దాదాపు కష్టమేనని విశ్లేషకుల అంచనా
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మొదటి టెస్ట్ వర్షం కారణంగా ఆలస్యమౌతున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటుపై కన్నేసిన భారత్.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఇదే వేదికపై 12 ఏళ్ల తర్వాత ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌ల్లో 36 ఏళ్లుగా న్యూజిలాండ్ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై ఆసక్తి నెలకొన్నది.
వర్షం పడుతుండటంతో టాస్ వేయడం సాధ్యం కాలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు వాన ఆగినా గ్రౌండ్‌ను సిద్ధం చేయడానికి అరగంట నుంచి గంట పడుతుంది. ఆ తర్వాతే టాస్ వేస్తారు. టాస్ అనంతరం ఆట మొదలు కావడానికి కనీసం 15 నుంచి 30 నిమిషాల సమయం పట్టనున్నది. దీంతో మొదటిరోజు మొదటి సెషన్ ఆట సాధ్యపడటం దాదాపు కష్టమేనని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.