సెమీస్‌పై సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌లో భారత్ , న్యూజిలాండ్ చివరి మ్యాచ్ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ సూచన

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడటానికి సిద్ధమైంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్నది. ఓడిన టీమ్ మరో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టనున్నది. అయితే కివీస్‌పై టీమిండియా గెలిచి.. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు. దానికి కారణం ఏమిటో విశ్లేషించాడు. సెమీస్‌కు చేరిన ఏ జట్టూ చిన్నదేమీ కాదు. అందుకే, ఎక్కడా ఏ తప్పు చేయకూడదు. ఇప్పుడు నాకౌట్ స్టేజ్‌కు వచ్చేశాం. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే ముందుకు వెళ్తాం. నేను మాత్రం సెమీస్‌లో ఆసీస్‌తోనే భారత్ ఆడాలని కోరుకుంటా. ప్రధాన బౌలర్లు లేకుండా ఈ సారి ఆ జట్టు బరిలోకి దిగింది. టీమిండియాతో పోలిస్తే అనుభవం తక్కువే. స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ ఆడుంటే ఆ జట్టు పరిస్థితి వేరేగా ఉండేది. గ్రూప్ దశలో బ్యాటర్లు సత్తా చాటడంతో ఆసీస్ సెమీస్‌కు చేరుకోగలిగిందని గవాస్కర్ తెలిపాడు.