జొహనెస్ బర్గ్ లో సిక్సర్లల సునామీ
283 పరుగుల భారీ స్కోర్ చేసిన టీమిండియా.. లక్ష్య చేదనలో తడబడుతున్న సౌత్ ఆఫ్రికా
జొహనెస్ బర్గ్ లో టీమిండియా బ్యాట్స్‌మన్లు సిక్సర్లు, ఫోర్లతో పరుగుల సునామీ సృష్టించారు. టీ 20లో టీమిండియా తరపున అత్యధిక స్కోర్ తో పాటు పలు కొత్త రికార్డులు నెలకొల్పారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వరుసగా రెండో సెంచరీ చేయగా, సంజూ శాంసన్ ఈ సిరీస్ లో రెండో సెంచరీ చేశాడు. సౌత్ ఆఫ్రికాతో జొహనెస్‌బర్గ్ వేదికగా జరుగుతోన్న నాలుగో టీ 20 మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా మొదటి ఓవర్ నుంచే దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో నాలుగు సిక్సులు, రెండు ఫోర్లతో 36 పరుగులు చేసి సింప్లా బౌలింగ్ లో క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ మరో ఓపెనర్ సంజూ శాంసన్ తో కలిసి నిర్దయగా దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీమిండియా ఇన్నింగ్స్ లో మొత్తం 23 సిక్సర్లు, 17 ఫోర్లు బాదారు. తిలక్ వర్మ 47 బంతుల్లో పది సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూ శాంసన్ 56 బంతుల్లో తొమ్మిది సిక్సర్లు, ఆరు ఫోర్లతో 109 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోయి 283 పరుగులు చేసింది. 284 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఒత్తిడిలో త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రీనా హెడ్రిక్స్ ను అర్షదీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ రియా రికల్టర్ హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ అయిడెన్ మార్క్రమ్ అర్షదీప్ బౌలింగ్ లో ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ ను రవి బిష్ణోయ్ తీసుకొని అతడిని పెవిలియన్ కు చేర్చాడు. హెన్రీచ్ క్లాసెన్ బ్యాటింగ్ కు వస్తూనే వికెట్ల ముందు అర్షదీప్ కు దొరికిపోయారు. హెడ్రిక్స్, క్లాసెన్ డకౌట్ అవగా, మార్క్రమ్ 8 పరుగులు, రికల్టన్ ఒక పరుగు చేసి ఔటయ్యారు. ట్రిస్టన్ స్టబ్స్ 9 రన్స్, డేవిడ్ మిల్లర్ 4 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇండియన్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు, హార్థిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.