కివీస్ ఓటమి కలిసొచ్చింది.. ఐటీసీ టేబుల్‌లో టాప్ ప్లేస్‌కు భారత్
ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరగబోతున్న చివరి టెస్ట్‌లో గెలిస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో నిలబడుతుంది. ఒకవేళ ఓడితే మళ్లీ మూడో ప్లేస్‌కు పడిపోయే అవకాశాలూ ఉన్నాయి.
ఇంగ్లాండ్‌తో సిరీస్ గెలిచినా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇంకా రెండో ప్లేస్‌లోనే కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా కివీస్ ఓటమి మనకు కలిసొచ్చింది. తాజాగా పట్టికలో భారత్ టాప్ ప్లేస్‌కు చేరింది.
టేబుల్ టాపర్ అయింది ఇలా..
ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లో 369 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఒక దశలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులతో పోరాడుతున్నట్లే కనిపించింది. అయితే ఆసీస్ స్పిన్నర్ లయన్ దెబ్బకు 196 పరుగులకే ఆలౌటయింది. దీంతో టెస్ట్ ఛాంపియన్ పాయింట్ల టేబుల్ రెండో స్థానానికి పడిపోయింది. 64.58% విజయాలతో ఉన్న భారత్ టేబుల్ టాపర్ అయింది.
చివరి టెస్ట్‌లో ఇండియా గెలిస్తేనే
ఇక ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరగబోతున్న చివరి టెస్ట్‌లో గెలిస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో నిలబడుతుంది. ఒకవేళ ఓడితే మళ్లీ మూడో ప్లేస్‌కు పడిపోయే అవకాశాలూ ఉన్నాయి. ఎందుకంటే న్యూజిలాండ్‌కు ఆస్ట్రేలియాతో ఇంకో టెస్ట్ ఉంది. మనం ఇంగ్లాండ్‌తో ఓడి, కివీస్ ఆస్ట్రేలియాపై గెలిస్తే మళ్లీ ర్యాంకులు తారుమారు కావచ్చు.