Telugu Global
Sports

103 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన భారత్‌

16/1తో ఆట ఆరంభించిన టీమిండియా తొలి సెషన్‌ ముగియకముందే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది

103 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన భారత్‌
X

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మొదటి ఇన్సింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు మరోసారి తేలిపోయారు. రెండో రోజు 16/1తో ఆట ఆరంభించిన భారత్‌ తొలి సెషన్‌ ముగియకముందే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్‌ గిల్‌ (30) శాంట్నర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరుగగా.. ఆ తర్వాత వచ్చిన విరాట్‌ కోహ్లీ (1) శాంట్నర్‌ బౌలింగ్‌లోనే క్లీన్‌ బౌల్డ్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం ఓపెనర్‌ జైస్వాల్‌ (30) కూడా పెవిలియన్‌ దారి పట్టాడు. మొదటి టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన కీపర్‌ రిషభ్‌ పంత్‌ (18) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. దీంతో 38 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 103 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. ప్రస్తుతం క్రీజ్‌లో రవీంద్ర జడేజా (11 నాటౌట్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (2 నాటౌట్‌) ఉన్నారు. కివీస్‌ స్పిన్నర్లు శాంట్నర్‌ (4/36), గ్లేన్‌ ఫిలిప్స్‌ (2/26) దెబ్బకు ఈ సెషన్‌లో ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది.

First Published:  25 Oct 2024 11:26 AM IST
Next Story