Under-19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 41 రన్స్ తేడాతో విజయం
అండర్-19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్ నిలిచింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై 41 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 117/7 రన్స్ చేసింది.గొంగడి త్రిష 47 బాల్స్‌లోనే 52 రన్స్ చేసి రాణించింది. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన బంగ్లా జట్టు 76 రన్స్‌కే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు పడగొట్టింది. సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా చెరో 2 వికెట్లు, జోషిత ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా స్వల్ప వ్యవధిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కమిలిని (5), వన్‌డౌన్ బ్యాటర్ సానికా చల్కే (0) వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. అయితే మరో ఓపెనర్ త్రిష (52) మాత్రం అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. కెప్టెన్ నికీ ప్రసాద్ (12) తో కలిసి జట్టును ఆదుకున్నది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 41 రన్స్ జోడించారు. కెప్టెన్ ఔటైన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన ఐశ్వరి (5) ఎక్కువసేపు నిలువలేదు. బంగ్లా బౌలర్ల విజృంభించడంతో ఐశ్వరితోపాటు హాఫ్ సెంచరీ సాధించిన త్రిష పెవిలియన్‌కు చేరింది. దీంతో భారత్ స్కోరు వంద దాటుటుందా? అనే అనుమానం వచ్చింది. కానీ మిథిలా (17), ఆయుషి శుక్లా (10) ఆఖర్లో దూకుడు ప్రదర్శించారు. బంగ్లా బౌలర్లలో ఫర్జానా 4, నిషితా అక్తర్ నిషి 2, హబిబా ఒక వికెట్ తీశారు.