డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఇండియా దాదాపు ఔట్!
ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ ను శ్రీలంక స్వీప్ చేస్తేనే అవకాశం
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ రేసు నుంచి ఇండియా దాదాపు ఔట్ అయ్యింది. మెల్‌బోర్న్ టెస్ట్ లో ఘోర పరాజయంతో ఇండియాకు ద్వారాలు మూసుకుపోయాయి. స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ గా సమర్పించేయడం, బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల సిరీస్ లో 2-1తో వెనుకబడటంతో ఇండియా లార్డ్స్ కు చేరే అవకాశాలు మృగ్యమయ్యాయి. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ కు సౌత్ ఆఫ్రికా చేరింది. రెండో బెర్త్ కోసం ఇండియా కన్నా ఆస్ట్రేలియా చాలా ముందే ఉంది. జనవరి మూడో తేదీ నుంచి జరిగే ఐదో టెస్టులో ఆస్ట్రేలియాతో ఘన విజయం సాధించినా ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరదు. ఆస్ట్రేలియా త్వరలో శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో తలపడబోతుంది. ఆ సిరీస్ ను కనుక శ్రీలంక 2-0, 1-0 తేడాదితో సొంతం చేసుకుంటే ఇండియాకు ఏమైనా చాన్స్ దక్కొచ్చు. ఆస్ట్రేలియా ప్రస్తుత ఫామ్ ను చూస్తుంటే అలాంటి ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదని అనిపిస్తోంది.