రేపటి నుంచే ఇండియా - ఆసీస్ రెండో టెస్టు
అడిలైడ్ టెస్టుకు సిద్ధమవుతోన్న రెండు జట్లు
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో పింక్ బాల్ టెస్టుకు కౌంట్ డౌన్ షురువయ్యింది. అడిలైడ్ వేదికగా జరిగే డై అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా భారీ ఆదిక్యంతో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌లో ముందంజలో నిలిచింది. ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్ అయినా, ఆసీస్‌ను 104 పరుగులకే ఆలౌట్ చేసి ఆదిక్యం దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో భారీ స్కోర్ చేసి ఆసీస్‌పై ఒత్తిడి పెంచింది. ఎవరెస్టు లాంటి టార్గెట్‌ను చేదించడంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ ఆదిలోనే వికెట్లు సమర్పించుకున్నారు. కాసేపు పోరాడినా భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. అడిలైడ్ వేదికగా జరగబోతున్న పింక్ బాల్ టెస్టులోనూ బౌలర్ల ఆదిపత్యం కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. సాయంత్రం అవుతున్న కొద్దీ ఆ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం, పరుగులు రాబట్టడం కష్టంతో కూడుకున్న పని అని క్రీడా పండితులు చెప్తున్నారు. మొదటి టెస్టు మాదిరిగానే రెండో టెస్టు కూడా ఐదు రోజులు సాగే అవకాశాలు కనిపించడం లేదు. నాలుగు రోజులు, అంతకన్నా తక్కువ రోజులకే అడిలైడ్ టెస్టులో రిజల్ట్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. కొడుకు పుట్టడంతో మొదటి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టులో యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశాలున్నాయి.