Telugu Global
Sports

రెండో వన్డేలోనూ భారత్‌ విజయం

సెంచరీతో అదరగొట్టిన భారత బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం

రెండో వన్డేలోనూ భారత్‌ విజయం
X

విండీస్‌ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు 115 రన్స్‌ తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విండీస్‌.. 243 రన్స్‌కు ఆలౌటైంది. హేలీ మ్యాత్యూస్‌ (106) సెంచరీ చేసినప్పటికీ విండీస్‌ను ఓటమని నుంచి రక్షించలేకపోయింది. దీప్తి శర్మ 2, సాధు 2, ప్రియా మిశ్రా 3, రేణుకా ఠాకూర్‌, ప్రాతికా రావల్‌ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్‌ చేసిన 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్‌ 358 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. వన్డేల్లో భారత్‌ 350కి పైగా స్కోర్‌ చేయడం ఇది రెండోసారి. 2022లో ఐర్లాండ్‌పై కూడా సరిగ్గా 5 వికెట్ల నష్టానికి 358 స్కోర్‌ చేసిన సంగతి తెలిసిందే.

వన్‌ డౌన్‌ బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌ (115) అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. ప్రతికా రావల్‌ (76), స్మృతి మంధాన (53), రోడ్రిగ్స్‌ (52) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో ఫ్లెచ్చర్‌, జేమ్స్, జోసెఫ్‌, డాటిన్‌ చెరో వికెట్‌ తీశారు. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0తో లీడ్‌లో ఉన్నది.

First Published:  24 Dec 2024 9:31 PM IST
Next Story