Telugu Global
Sports

కివీస్‌ ముందు 200 రన్స్‌ టార్గెట్‌ పెడితే గెలవొచ్చు

నాలుగో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌ చాలా కఠినంగా ఉంటుందన్నమాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే

కివీస్‌ ముందు 200 రన్స్‌ టార్గెట్‌ పెడితే గెలవొచ్చు
X

టీమిండియా-కివీస్‌ జట్ల మధ్య మొదటి టెస్ట్‌ ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తున్నది. 356 రన్స్‌ లోటుతో రెండో ఇన్సింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా ప్రస్తుతం 231/3 స్కోర్‌తో నిలిచింది. ఇంకా 125 రన్స్‌ వెనుకబడి ఉన్నది. ప్రస్తుతం క్రీజ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ హాఫ్‌ సెంచరీతో ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, అశ్విన్‌ బ్యాటింగ్‌ చేయాల్సి ఉన్నది. ఈ క్రమంలో నాలుగో రోజు తొలి సెషన్‌ కీలకం కానున్నది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ లంచ్‌ బ్రేక్‌ సమాయానికే లీడ్‌లోకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థికి కనీసం 150-200 రన్స్‌ నిర్దేశిస్తే గెలుపు సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నాడు. నాలుగో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌ చాలా కఠినంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.

నాలుగో రోజు మొదటి సెషన్‌ ముగిసే నాటికి టీమిండియా ఇప్పుడున్న లోటును అధిగమిస్తుంది. స్వల్ప ఆధిక్యాన్ని సాధించినా ఆశ్చర్యపోనక్కర లేదన్నాడు. కానీ ఫస్ట్‌ పది ఓవర్లు చాలా కీలకం అన్నాడు. పేస్‌కు అనుకూలంగా ఉంటుందని, ఇంకా నలుగురు బ్యాటర్లు ఉన్న నేపథ్యంలో లీడ్‌ను 200 వరకు తీసుకెళ్లగలిగితే మ్యాచ్‌లో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయన్నాడు. చివరి ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం కష్టంగా ఉంటుందన్నాడు. భారత జట్టులో ముగ్గురు మెరుగైన స్పిన్నర్లు ఉన్నారని కుంబ్లే వెల్లడించాడు.

First Published:  19 Oct 2024 9:26 AM IST
Next Story