Telugu Global
Sports

ఇవాళ్టి నుంచే అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌... ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడంటే..

సౌతాఫ్రికా వేదికగా అండర్‌ - 19 వరల్డ్‌ కప్‌ ఇవాళ్టి నుంచే ప్రారంభం అవుతోంది.

ఇవాళ్టి నుంచే అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌.. ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడంటే..
X

రెండు నెలల క్రితమే భారత్‌లో ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత ఐసీసీ మరో ప్రతిష్టాత్మక టోర్నీతో సిద్ధమైంది. సౌతాఫ్రికా వేదికగా అండర్‌ - 19 వరల్డ్‌ కప్‌ ఇవాళ్టి నుంచే ప్రారంభం అవుతోంది. 15వ ఎడిషన్‌గా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఐర్లాండ్‌ – యూఎస్‌ఏ మధ్య తొలిమ్యాచ్‌ జరగనుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1.30గంటలకు లైవ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.

లైవ్‌ స్ట్రీమింగ్‌...

ప్రపంచకప్‌ లైవ్‌ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌లో చూడొచ్చు. యాప్‌లో అయితే డిస్నీ హాట్‌ స్టార్‌ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. వాస్తవానికి శ్రీలంకలో ఈ అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌ జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంపై నిషేధం ఉండటంతో సౌతాఫ్రికాకు షిఫ్ట్‌ అయింది.

భారత్‌ మ్యాచ్‌ తేదీలు ఇవే...

జనవరి 20 : ఇండియా Vs బంగ్లాదేశ్‌

జనవరి 25 : ఇండియా Vs ఐర్లాండ్‌

జనవరి 28 : ఇండియా Vs యూఎస్‌ఎ

భారత జట్టు:

ఉదయ్‌ సహరన్‌ (కెప్టెన్‌), అర్షిన్‌ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్‌, రుద్ర మయూర్‌ పటేల్‌, సచిన్‌ దాస్‌, ప్రియాన్షు మోలియా, ముషీర్‌ ఖాన్‌, ఎరవెల్లి అవినాశ్‌ రావు, సౌమ్య కుమార్‌ పాండే, మురుగన్‌ అభిషేక్‌, ఇన్నేష్‌ మహాజన్‌, ధనుష్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి

గ్రూపుల వివరాలు

గ్రూప్‌ – A : భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఎ

గ్రూప్‌ – B : ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌

గ్రూప్‌ – C : ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా

గ్రూప్‌ – D : న్యూజిలాండ్‌, ఆఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌, నేపాల్‌

16 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో జట్లను 4 గ్రూపులుగా విడగొట్టారు. టీమిండియా గ్రూప్‌ – A లో ఉంది.

ఇవాళ్టి నుంచి లీగ్‌ పోటీలు జరుగుతాయి. ప్రతి గ్రూపులో టాప్‌ -3లో ఉన్న జట్లు సూపర్‌ సిక్స్‌కు చేరుతాయి. సూపర్‌ సిక్స్‌లో కూడా మళ్లీ నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడతాయి. ప్రతి గ్రూపులో టాప్‌లో ఉన్న టీం సెమీస్‌కు వెళ్తుంది. ఫిబ్రవరి 3 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఫిబ్రవరి 6, 8 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్‌ ఉంటాయి. ఫిబ్రవరి 11న బెనొనిలోని విల్లోమూర్‌ పార్క్‌ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

First Published:  19 Jan 2024 12:32 AM IST
Next Story