ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. ఒకే గ్రూప్‌లో ఇండియా, పాక్
దుబయి వేదికగా భారత్ మ్యాచ్‌లు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ దాదాపుగా ఖరారు అయ్యింది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా తలపడుతున్న ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ తటస్థ వేదిక దుబయి వేదికగా నిర్వహించనున్నారు. ఇండియా అన్ని మ్యాచ్‌లు దుబయిలోనే జరగనున్నాయి. గ్రూప్ -ఏలో ఆతిథ్య పాకిస్థాన్‌తో పాటు ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సాత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు చాంపియన్‌షిప్ టోర్నీ నిర్వహించనున్నారు. ఇండియా తన మొదటి మ్యాచ్‌లో 20న బంగ్లాదేశ్ తో తలపడనుంది. 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్ ను ఎదుర్కోబోతుంది. టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది.