Telugu Global
Sports

టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో అర్షదీప్‌ సింగ్‌

నామినేట్‌ అయిన నలుగురు క్రికెటర్ల పేర్లు ప్రకటించిన ఐసీసీ

టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో అర్షదీప్‌ సింగ్‌
X

ఐసీసీ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో ఇండియన్‌ క్రికెటర్‌ అర్షదీప్‌ సింగ్‌ నిలిచాడు. ఈ అవార్డుకు మొత్తం నలుగురు క్రికెటర్లు నామినేట్‌ కాగా వారి పేర్లను ఐసీసీ ప్రకటించింది. అర్షదీప్‌ సింగ్‌ తో పాటు సికిందర్‌ రజా (జింబాబ్వే), బాబర్‌ ఆజమ్‌ (పాకిస్థాన్‌), ట్రావిస్‌ హెడ్‌ (ఆస్ట్రేలియా) ఉన్నారు. ఉమెన్‌ క్రికెటర్లలో భారత్‌ నుంచి ఎవరికి అవకాశం దక్కలేదు. అర్షదీప్‌ సింగ్‌ 18 టీ20 మ్యాచుల్లో 36 వికెట్లు పడగొట్టాడు. బాబర్‌ ఆజమ్‌ 23 ఇన్నింగ్సల్లో 738 పరుగులు చేశాడు. ట్రావిస్‌ హెడ్‌ 15 ఇన్నింగ్సుల్లో 539 పరుగులు చేశాడు. సికిందర్‌ రజా 23 ఇన్నింగ్సల్లో 573 పరుగులు చేయడంతో పాటు 24 వికెట్లు పడగొట్టాడు. వీరిలో ఒకరిని ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు వరించనుంది. ఉమన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు కోసం చమరి ఆటపట్టు (శ్రీలంక), మెలీ కెర్ (న్యూజిలాండ్), లారా వోల్వార్ట్డ్‌ (దక్షిణ ఆఫ్రికా), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (ఐర్లాండ్) ఉన్నారు.

First Published:  29 Dec 2024 4:32 PM IST
Next Story