ప్రొ కబడ్డీ సీజన్-11 విజేతగా హర్యానా స్టీలర్స్
ఫైనల్‌లో 32-23 తేడాతో పాట్నా పైరేట్స్‌ను ఓడించి తొలిసారి ఛాంపియన్‌గా అవతరణ
BY Raju Asari30 Dec 2024 4:06 AM IST
X
Raju Asari Updated On: 30 Dec 2024 4:06 AM IST
ప్రొ కబడ్డీ సీజన్-11లో హర్యానా స్టీలర్స్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో 32-23 తేడాతో పాట్నా పైరేట్స్‌ను ఓడించి మొదటిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఆ జట్టులో శివమ్ (9), మహ్మద్ రెజా (7), వినయ్ (6) అదరగొట్టారు. ఈ టైటిల్ పోరులో మొదట ఇరుజటటు హోరాహోరీగా తలపడ్డాయి. ఒక దశలో స్కోరు 8-8 తో సమంగా ఉండగా తర్వాత పాట్నా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. విరామ సమయానికి 15-12 తో స్వల్ప ఆధిక్యంలో నిలిచిన హర్యానా.. బ్రేక్ తర్వాత జోరు మరింత పెంచింది. వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని మరింత పెంచుకుని అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నది. గత సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న హర్యానా.. ఈ సీజన్‌లో విజేతగా నిలవడం గమనార్హం.
Next Story