Telugu Global
Sports

రెజ్లింగ్‌కు వినేశ్‌ ఫొగాట్‌ గుడ్‌బై

అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ వేదికగా రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది.

రెజ్లింగ్‌కు వినేశ్‌ ఫొగాట్‌ గుడ్‌బై
X

అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ వేదికగా రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. ‘మీకల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు " అంటూ ట్వీట్ చేసింది. కుస్తీకి గుడ్ బై 2001-2024 అంటూ వినేశ్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

యావత్ భారత దేశం కన్న కల ఒలింపిక్స్ లో స్వర్ణం. ఆ కలను నిజం చేసే బాధ్యతను తనపైకి ఎత్తుకొని అద్భుతంగా పోరాడిన వినేష్ ఫోగట్ కు చివరి అడుగులో బ్రేక్ పడింది. 100 గ్రాముల బరువు కారణంగా అందరి ఆశలు చెదిరిపోయింది. ప్రతి భారతీయుడి గుండె పగిలిపోయింది. ఊహించని ఈ పరిణామంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. దేశపు అంచలను నిజం చేస్తూ పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరిన వినేశ్‌.. అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది. ఒకవేళ వినేష్ ఫైనల్ గెలిస్తే స్వర్ణం వచ్చేది. లేకుంటే రజిత పతకం అయినా వచ్చేది. కానీ జరిగిన సంఘటనతో అసలు ఏ పతకమూ రాకుండా పోయింది. ఈ నేపధ్యంలో వినేష్ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ ఫొగాట్‌ కోర్ట్‌ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తను సిల్వర్‌ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్బిట్రేషన్‌ తీర్పు వెలువరించాల్సి ఉంది.

వినేశ్‌కు ఇప్పటి వరకు రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమిపాలవ్వగా 2016లో ఆమెను దురదృష్టం వెంటాడింది.. క్వార్టర్‌ ఫైనల్లో మోకాలు మెలిక పడి లేచి అసలు లేచి నిలబడలేని స్థితి వచ్చింది. తీవ్ర గాయంతో వీల్ ఛైర్‌‌లో ఆమె భారత్‌కు చేరుకున్న సన్నివేశం దేశ ప్రజలను కలచివేసింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శనతో కఠిన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌ చేరుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్ కు వెళ్లిన తొలి మహిళా రెజ్లర్ గా రికార్డు సృష్టించింది. కానీ అనూహ్య పరిణామాలతో రిటైర్‌మెంట్‌ ప్రకటించింది.

First Published:  8 Aug 2024 11:11 AM IST
Next Story