Telugu Global
Sports

భార్యాపిల్లల ఎదుటే శ్రీలంక మాజీ క్రికెటర్‌ దారుణ హత్య

శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన దారుణ హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లల ఎదుటే గుర్తు తెలియని వ్యక్తి నిరోషన దారుణంగా కాల్చి చంపాడు.

భార్యాపిల్లల ఎదుటే శ్రీలంక మాజీ క్రికెటర్‌ దారుణ హత్య
X

శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన దారుణ హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లల ఎదుటే గుర్తు తెలియని వ్యక్తి నిరోషన దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి శ్రీలంకలోని అంబలంగోడలోని అతడి నివాసంలో జరిగింది. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

స్థానిక మీడియా కథనం ప్రకారం..

ధమ్మిక గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడి ఇంట్లోకి చొరబడి ఈ మాజీ క్రికెటర్‌పై దాడి చేశాడు. భార్య, ఇద్దరు పిల్లల ముందే తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధమ్మిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా దుండగుడు తప్పించుకున్నాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

ధమ్మిక నిరోషన 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్‌-19 జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండేళ్ల పాటు శ్రీలంక జూనియర్ జట్టుకు వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 మ్యాచ్‌లు, లిస్ట్-ఏలో 8 మ్యాచ్‌లు ఆడాడు, వరుసగా 19, 5 వికెట్లు పడగొట్టాడు..కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 20 ఏళ్లకే క్రికెట్‌ను వదిలేశాడు. శ్రీలంకలోని చిలావ్ మారియన్స్ క్రికెట్ క్లబ్, గాలే క్రికెట్ క్లబ్ మరియు సింఘా స్పోర్ట్స్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వచించాడు. అలాగే శ్రీలంకలోని చిలావ్ మారియన్స్ క్రికెట్ క్లబ్, గాలే క్రికెట్ క్లబ్, సింఘా స్పోర్ట్స్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వచించాడు.

First Published:  17 July 2024 3:33 PM IST
Next Story