Telugu Global
Sports

ముగిసిన మొదటిరోజు ఆట.. ఆసీస్‌ 311/6

హాఫ్‌ సెంచరీలు సాధించిన టాప్‌-4 ఆటగాళ్లు

ముగిసిన మొదటిరోజు ఆట.. ఆసీస్‌ 311/6
X

బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్‌ బ్యాటర్లు చెలరేగారు. బ్యాటింగ్‌ వరుసలోని టాప్‌-4 ఆటగాళ్లు హాఫ్‌ సెంచరీలు సాధించారు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 రన్స్‌ చేసింది. క్రీజ్‌లో స్టీవ్‌ స్మిత్‌ (68*), పాట్‌ కమిన్స్‌ (8*) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు సామ్‌ కాన్‌స్టాస్‌ (60), ఉస్మాన్‌ ఖవాజా (57) తోపాటు మార్నస్‌ లబుషేన్‌ (57) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బూమ్రా 3, ఆకాశ్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్‌ తీశారు.

First Published:  26 Dec 2024 12:59 PM IST
Next Story