Telugu Global
Sports

రాణించిన గిల్‌, పంత్‌.. భారత్‌ 195/5

న్యూజిలాండ్‌ తొలి ఇన్సింగ్స్‌ స్కోర్‌ సమం చేయాలంటే భారత్‌ ఇంకా 40 పరుగులు చేయాలి

రాణించిన గిల్‌, పంత్‌.. భారత్‌ 195/5
X

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ 195/5 రన్స్‌ చేసింది. మరో 40 పరుగులు వెనుకబడి ఉన్నది. శుభ్‌మన్‌ గిల్‌ (70 నాటౌట్‌), రవీంద్ర జడేజా (10 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. కీపర్‌ రిషబ్‌ పంత్‌ 60 రన్స్‌ చేసి రాణించాడు. కివీస్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 2 వికెట్లు, హెన్రీ, ఇష్‌ సోదీ చెరో వికెట్‌ పడగొట్టారు. తొలి ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్‌ 235 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా చేజార్చుకున్నది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ వైట్‌వాష్‌ కాకుండా చూసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం భారత్‌పై ఉన్నది. ముంబుయి వేదికగా జరుగుతున్న ఈ చివరి టెస్టులో భారత బౌలర్లు రాణించినా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో భారత్‌ కష్టాల్లో పడింది.ఓవర్‌నైట్‌ 84/4 స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు రిషబ్‌ పంత్‌ (60) అండగా నిలిచాడు. వన్డే మాదిరిగా ఆడిన పంత్‌ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 94 రన్స్‌ జోడించాడు. వీరిద్దరికి స్వల్ప వ్యవధిలో లైఫ్‌లు దొరికాయి. కివీస్‌ ఫీల్డర్లు రెండు క్యాచ్‌లను వదిలేశారు. దాంతో వాటిని సద్వినియోగం చేసుకున్న పంత్‌-గిల్‌ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు. అయితే ఇన్సింగ్స్‌లో 38వ ఓవర్‌ వేసిన సోధి బంతిని అంచనా వేయడంతో పంత్‌ కాస్త తడబాటుకు గురయ్యాడు. అంపైర్‌ ఎల్బీ ఇవ్వడంతో డీఆర్‌ఎస్‌ తీసుకున్నా సానుకూల ఫలితం రాలేదు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.ఈ క్రమంలో ఇవాళ ఇన్నింగ్స్‌ అత్యంత కీలకమని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి ఇన్సింగ్స్‌లో భారత్‌ మెరుగైన ఆధిక్యం సాధిస్తేనే మ్యాచ్‌ విజయంపై భారత్‌కు ఆశలు ఉంటాయి.

First Published:  2 Nov 2024 6:23 AM GMT
Next Story